గీతములకు గీతము- పరమ గీతము
*గీతాలకు గీతము-పరమగీతము*
*మొదటి భాగము- ఉపోద్ఘాతము-1*
ప్రియ దైవజనమా!
యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ శుభాది వందనములు! ఈ ఆధ్యాత్మిక సందేశాలు- 13 లో భాగంగా మరోసారి మిమ్మల్ని
ఇలా కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది! ఈసారి పరమగీతములు అనే అత్యంత
శ్రేష్టమైన పుస్తకము మరియు అనేకులకు వివాదాస్పదమైన పుస్తకమునుండి పరిశుద్ధాత్మ దేవుడు
మనతో మాట్లాడేది ధ్యానం చేసుకుందాం!
నిజానికి అనేకులు
ఈ పుస్తకాన్ని చదవడానికి ఆలోచిస్తారు, మరికొంతమంది సిగ్గుపడతారు. మరికొంతమంది క్రీస్తు విరోధులు
ఇది ఒక బూతు పుస్తకము అంటారు! మరికొంతమంది బైబిల్ ను పరిశుద్ధ
గ్రంధము అంటారు కదా మరి ఇలాంటి పుస్తకము బైబిల్ లో ఎలా ఉంది అంటారు! మరి కొంతమంది బైబిల్ లో ఉన్న ప్రతీ వచనం ప్రతీ అధ్యాయం ప్రతీ పుస్తకము పరిశుద్ధాత్ముడు
వ్రాయించాడు కదా! మరి ఇలాంటి పుస్తకము ఎందుకు బైబిల్ లో జతచేయబడింది
అంటారు! కాబట్టి మొదట ఈ పుస్తకము యొక్క విశేషము తెలుసుకుని ఆ
తర్వాత నేపధ్యం తెలుసుకుని అప్పుడు ఈ గ్రంధము కోసం ధ్యానం చేద్దాం!
ముఖ్యాంశం:
ఈ పుస్తకాన్ని గురించి వ్యాఖ్యానించినవారు ముఖ్యాంశ విషయంలో గాని, కథలోని ముఖ్య పాత్రధారుల
విషయంలో గాని ఏకీభవించడం లేదు. కొందరి అభిప్రాయం ప్రకారం ఈ పుస్తకం
రాజైన సొలొమోనుకూ అతని వధువుకూ మధ్యనున్న ప్రేమను గీతం రూపంలో చిత్రించిన వర్ణన మాత్రమే.
మరికొందరు ఆధునిక వ్యాఖ్యానకర్తలు ఇలా అంటున్నారు –
మొదటిది: ఈ పుస్తకంలోని ప్రేమకథ పేరు తెలియని
ఒక కాపరికీ అతని వధువుకూ మధ్యనున్న ప్రేమను గురించి తెలియజేస్తున్నది. సొలొమోనురాజు దుష్టుని పాత్ర వహించి కాపరి వధువును తాను ఉంచుకోవడానికి ఎత్తుకుపోవాలని
ప్రయత్నించాడు (ఈ వ్యాఖ్యానం సమంజసంగా లేదు).
రెండు: రాజైన సోలోమోను తాను ఇంకా యవ్వనస్తునిగా
ఉన్నప్పుడు రాజ్యమంతా పర్యటించేటప్పుడు షూనేము ప్రాంతానికి వస్తాడు. అక్కడ ఒక యవ్వనురాలను చూసి ప్రేమిస్తాడు. అయితే తాను
రాజకుమారుడు అని తెలిస్తే భయపడి తనను ఎక్కడ తిరస్కరిస్తుందోనని భావించి ఒక గొల్ల పిల్లవానిలా
వేషం వేసుకుని ఆమెకు దగ్గరవుతాడు. ఈలోగా ఆమె యొక్క అన్నలు
(సవితి అన్నలు అనగా ఆ అన్నలు యొక్క తల్లి చనిపోయిన తర్వాత షూలమ్మితి
తల్లిని పెళ్లి చేసుకుంటాడు తండ్రి) ఆమెకు ఒక వ్యక్తితో ప్రధానం
చేస్తారు! గాని షూలమ్మితి ఈ గొల్లపిల్లవాని వేషంలో ఉన్న సోలోమోనును
ప్రేమిస్తుంది గనుక అన్నలు కోపపడి వారియొక్క ద్రాక్షతోటకు కాపలాదారిగా నియమిస్తారు. దానితోపాటు చిన్న మందను కూడా కాపాలాకాయమని
అప్పగిస్తారు! గాని ఆమె సొంత తోటను, సొంత
మందను పట్టించుకోకుండా సొలోమోను చుట్టూ తిరుగుతుంది. అప్పుడు
సోలోమోను తాను ఎవరో చెబుతాడు. ఈ విషయం తెలిసిన అన్నలు ఆమెను సోలోమోను
పొలములో పనికత్తెగా నియమిస్తారు. అప్పుడు ఆమె షూనేము నుండి యెరూషలేము
వచ్చి సోలోమోను పొలములో ఒక దాసీగా పనిచేస్తుంది. అదికూడా ఎండలో
పనిచేస్తుంది. అప్పుడు ఆమె సౌందర్యము దెబ్బతింటుంది అయినా సోలోమోను
ఆమెనే ప్రేమించి పెళ్లిచేసుకుంటాడు! ఇది అనేకమంది నిజముగా జరిగింది
అని భావించే గాధ!
మూడు: మరికొందరైతే ఈ పుస్తకం అలంకారిక రీతిలో
దేవునికీ విశ్వాసులకూ మధ్యనున్న ప్రేమను చిత్రించినది కాదని వ్యాఖ్యానిస్తున్నారు.
మరి కొందరైతే ఈ పుస్తకానికి ఇదే ముఖ్యాంశం అంటున్నారు.
ఏదిఏమైనా మెజారిటీ బైబిల్ పండితులు ఈ
ప్రేమ కథలోని ప్రధాన పాత్రధారులు సొలొమోనురాజు, అతని వధువు
అని నమ్ముతున్నాడు. అంతేగాక ఈ కథలో సాదృశ్య రూపంలో ఆత్మ సంబంధంగా
అనేక అంతరార్థాలు ఉన్నాయనీ అలంకార రీతిలో రారాజైన యేసుక్రీస్తుకూ, ఆయన సంఘం, లేక విశ్వాసులైన వ్యక్తులకూ మధ్యనున్న ప్రేమను
వివరిస్తున్నదనీ కూడా నమ్ముతున్నారు. ఇలా నమ్మడానికి గల కారణాలు
ఇవి:
లేఖనాలలోని ఇతర భాగాలన్నిటిలాగానే ఈ పుస్తకం పేరు కూడా దైవావేశం
వల్ల కలిగినదే. పరిశుద్ధాత్మ దేవుడే దీనిని “పరమ” గీతం – అంటే గీతాలన్నిటిలో
ఉత్తమమైనది, సర్వశ్రేష్ఠమైనది (దీని హీబ్రూ
పేరుకు అర్థం ఇదే) అని అంటున్నాడంటే అలా అనడానికి తగిన కారణాలు
తప్పక ఉండాలి. అది కేవలం సొలొమోనుకూ, అతని
వధువుకూ మధ్యనున్న ప్రేమకథను వివరించేదే అయితే దానిని సర్వశ్రేష్ఠమైన గీతం అని ఎలా
అనగలం? అలా అనుకుంటే ఇది ఇస్రాయేల్‌లో అతి
మధుర కవి దావీదు రచించిన గీతాల కంటే సర్వశ్రేష్ఠమైనదా? అది కీర్తన
22 లేక 45 లేక 69 లేక
119 మొదలైనవాటికంటే శ్రేష్ఠమైనదా? క్రీస్తే దానిలో
లేకుంటే అది గీతాలన్నిట్లోకీ శ్రేష్ఠమైనది కాగలదా?
కొన్ని లేఖనాలు దేవునికీ ఆయన ప్రజలకూ మధ్యనున్న సంబంధాన్ని భార్యాభర్తల
సంబంధంతో పోల్చి చెపుతున్నాయి. కీర్తన 45; యెషయా 54:5; యిర్మీయా 3:14; 31:32; యెహె 16; 23; హోషేయ 2:7, 16 మొదలైనవి;
మత్తయి 22:1-2; రోమ్ 7:4; 2 కొరింతు 11:2; ఎఫెసు 5:25-32; ప్రకటన
19:6-9 చూడండి. దేవుణ్ణి ఇస్రాయేల్ జాతికి భర్తగానూ
క్రీస్తును సంఘానికి వరునిగానూ అభివర్ణిస్తూ ఉంటే బైబిలులోని ఒక పుస్తకం క్రీస్తుకూ
ఆయన సంఘానికి మధ్యనున్న ప్రేమను గురించి మానవ పరిభాషలో రాసివుండడం ఆశ్చర్యమేమీ కాదు.
ఇలాంటి ప్రేమ క్రీస్తుకు ఆయన ప్రజలకు మధ్య ఉండాలి, ఉంది. ఈ పుస్తకాన్ని అధ్యయనం చేసే సందర్భంలో పైన తెలిపిన
వాక్యభాగాలను పఠించాలి. అవి బైబిలులోని శ్రేష్ఠమైన అంశాల్లో ఒకదాన్ని
వెల్లడి చేస్తాయి.
భౌతికమైనవాటిలో
ఆధ్యాత్మిక భావాలున్న వేరు వేరు అంశాలు బైబిలులో కనిపిస్తున్నాయి. అలాంటి కొన్ని అంశాలను గమనించండి – ప్రత్యక్ష గుడారం, యాజకులు,
బలియాగాలు, ఇంకా నిర్గమకాండం, లేవీయకాండం గ్రంథాల్లో ఇలాంటి విషయాలను చూడండి. ఆ విషయాలు
అక్షరాలా వాస్తవమైనవే గాని వేరే అంతరార్థం కూడా వాటికి ఉంది. అవి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలకు సూచనలు, నీడలు.
శారా, హాగరుల కథ అలంకార రూపకంగా చెప్పబడినదని పౌలు
అంటున్నాడు (గలతీ 4:21-27)! శారా,
హాగరు చరిత్రలో అలంకార రూపంలో ఆధ్యాత్మిక సత్యం దాగివున్నప్పుడు అదేరీతిగా
ఈ గీతంలో కూడా ఆధ్యాత్మిక భావం అంతర్గతంగా దాగి ఉందని భావించవచ్చు గదా. శారా, హాగరు చరిత్రలో వాళ్ళిద్దరూ అక్షరాలా వాస్తవంగా
జీవించిన వ్యక్తులే. అదే రీతిగా ఈ గీతంలో సూచించిన వధూవరులు వాస్తవంగా
జీవించారన్న దానిని మనం కాదనడం లేదు. సొలొమోనురాజు, షూనేము యువతి నిజంగా జీవించిన వ్యక్తులే. అయినా ఇది పరలోక
సంబంధమైన ప్రేమను గురించి సాదృశ్య రూపంలో వివరిస్తున్న ఒక ఉదాహరణ. చూడగల కన్నులున్నవారు అంతర్గతంగా దీనిలో దాగిన ఆధ్యాత్మిక భావాన్ని గ్రహించగలుగుతారు.
లూకా 24:27; 2 తిమోతి 3:16-17లోని విషయాలను గమనించండి. పాత నిబంధనలో అన్నిచోట్లా క్రీస్తు
ఉన్నాడని ఈ ఒక్క పుస్తకంలో మాత్రం లేడని అనగలమా? ప్రతి చోటా ఆయనను
చూడడానికి ప్రయత్నించి, ఈ గీతంలో మాత్రం ఆయనను చూడకుండా ఉండడానికి
ప్రయత్నించాలా? ఈ పుస్తకంలో క్రీస్తు లేకుంటే, ఆత్మ సంబంధం, పరసంబంధం అయిన పాఠాలు దీనిలో లేకుంటే దేవుని
మనుషులు (ముఖ్యంగా పెండ్లి కానివారు) “సంసిద్ధులుగా
ప్రతి మంచి పనికి పూర్తిగా సమర్థులై” ఉండడానికి ఈ గీతం ఎలా సహాయపడగలదు?
ఈ పుస్తకంలో రాసిన కొన్ని విషయాలకు, సన్నివేశాలకు
తప్పక ఆత్మ సంబంధమైన అర్థం లేక అలంకార రూపంలో దాగి ఉన్న భావం ఉంటుందని గుర్తించాలి.
అక్షరాల సొలొమోనురాజు యొక్క వధువు రాత్రిపూట ఒంటరిగా అతన్ని వెతుక్కుంటూ
వీధులలో తిరుగులాడే విషయాన్ని ఊహించుకోవడం కష్టం (3:2-4). ఆమె
అలా తిరుగుతున్నప్పుడు కావలివారు ఆమెను కొట్టి ఆమె ముసుగు తీసుకుపోవడం కూడా ఊహించలేము
(5:6-7). ఆమె అక్షరాలా సొలొమోను మీద ఆనుకొని ఎడారి మార్గంలో వచ్చిందంటే
కూడా ఊహించడం కష్టమే (8:5). క్రీస్తుకు పూర్వమూ తరువాతా కూడా
ఉన్న భక్తిపరులైన వ్యాఖ్యాతలు ఈ పుస్తకాన్ని అలంకార రూపంలో ఉన్నవాటిని వివరించడం అనే
పద్ధతిని శతాబ్దాలుగా వాడుతూ వచ్చారు. ఇది యెహోవా దేవునికి ఇస్రాయేల్‌కూ మధ్యనున్న సంబంధాన్ని వర్ణిస్తున్నదని యూదులూ, క్రీస్తుకూ
తన సంఘానికీ మధ్యనున్న సంబంధాన్ని వర్ణిస్తున్నదని క్రైస్తవులూ భావిస్తూ వచ్చారు.
అందుచేత ఈ వివరణ పద్ధతి మనం కల్పించినది కాదు, లేక ఇటీవల వాడుకలోకి వచ్చినదేమీ కాదు.
పైన తెలిపిన కారణాలు తృప్తికరంగా లేవు అని పాఠకులు భావిస్తే
వాటిని తిరస్కరించవచ్చు. ఈ గీతాన్ని కేవలం మానవ ప్రేమ స్థాయిలో అర్థం
చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. మన ఉద్దేశాల్లో, లేఖన వివరణల్లో తప్పక లోపాలుంటాయి. పరిశుద్ధాత్మ ఇచ్చే
సహాయంతో ఈ పుస్తకాన్ని అధ్యయనం చేసినప్పుడు క్రీస్తు తన విశ్వాసులను ఎలా ప్రేమిస్తాడు,
వారు ఆయన్ను ఎలా ప్రేమించాలి అనేదాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవడానికి
వీలౌతుంది. అంతేగాక ఈ పుస్తకం విషయంలో అనుభవం అనేది సాటిలేని
బోధకుడని మా అభిప్రాయం. క్రీస్తు ప్రేమను ఎరిగినవారు మాత్రమే
దీనిలో ఏమున్నదో తెలుసుకోగలరు. ఈ పుస్తకమంతా ప్రేమను గురించే.
దైవాశీస్సులు!
*గీతాలకు గీతము-పరమగీతము*
*రెండవ భాగము- ఉపోద్ఘాతము-2*
(గతభాగం తరువాయి)
ప్రియులారా దీనిలోని అంశాలను అనేక
విధాలుగా విభజించారు! వాటిలో ముఖ్యమైనవి మాత్రం చూద్దాం!
మొదటిది: *గ్రంథ విభజన*
💚💜❤️❤️🤍🧡
◾మాటల్లో వెల్లడి అయిన ప్రేమ (1:2-4)
◾ఆందోళన చెందిన ప్రేమ (1:5-7)
◾కలయికలోని ప్రేమ (1:9-2:7)
◾ఎదురు చూచి, ఆహ్వానాన్ని పొందిన ప్రేమ (2:8-3:1)
◾పరీక్షకు లోనై నిరూపణ అయిన ప్రేమ (3:1-5)
◾శోభాయమానమైన రీతిలో వ్యక్తపరచిన ప్రేమ (3:6-11)
◾ప్రియురాలిలో ప్రియుని ఆనందం (4:1-16)
◾ప్రేమలోని తృప్తి (5:1)
◾బలహీనపడి బలం తిరిగి పుంజుకున్న ప్రేమ (5:2-8)
◾ప్రియుణ్ణి ప్రశంసించిన ప్రేమ (5:8-16)
◾నిబ్బరం గలిగిన ప్రేమ (6:1-3)
◾ప్రియురాలి సౌందర్యాన్ని పొగిడే ప్రేమ (6:4-12)
◾ప్రేమను వెల్లడించే సంభాషణ (7:1—8:4)
◾ప్రేమకున్న బలం (8:6-7)
◾ప్రేమ ఆలోచనలు (8:8-12)
◾ప్రేమ అభిలాష (8:13-14)
*గ్రంథములోని ప్రత్యేకతలు*
🔷🔷🔷🔷🔷🔷🔷🔷🔷
1️⃣ . *గ్రంథమును
మూడు భాగములుగా విభజించవచ్చును*
🔸🔸🔸🔸🔸🔹🔹🔹🔹🔹
🇦.
ప్రేమ యొక్క ప్రారంభం( 1:1-3:5)
🇧.
ప్రేమ వివాహము నందు సఫలీకృతమవుట (3:6-5:1)
🇨.
ప్రేమ వృద్ధిచెందుట (5:2-8:14)
రెండవది: బైబిల్ ను జాగ్రత్తగా స్టడీ చేసిన
గొప్ప దైవజనులు ముఖ్యంగా మూడు భాగాలుగా విభజించారు!
మొదటిది:1:1 నుండి 2:7
వరకు- అబ్రాహాము గారిని దేవుడు ప్రత్యేకపరచుకుని
పిలవడం నుండి సోలోమోను రాజై- వైభవముగా పాలించడం వరకు
రెండవది: 2:8 నుండి
5:16 వరకు-- బబులోనూ చెర- చెర విముక్తి- క్రీస్తు పుట్టుక-శిలువ మరణ పునరుత్థానము- సంఘము ప్రారంభము- యూదుల తిరస్కారము- అన్యజనులు రక్షించబడుట-
మూడవది: 5:17 నుండి చివర వరకు:
యేసుక్రీస్తు ప్రభులవారి రెండవ రాకడ మరియు వేయేండ్ల పాలన
సరే- గ్రంధాన్ని లేక గీతమును వ్రాసినది
ఎవరు?
1:1 ప్రకారము సోలోమోను గారు!
ఎప్పుడు రాశారు? క్రీ.
పూ. 970—940 మధ్యలో అనగా సోలోమోను రాజ్య పరిపాలన రాకమునుపు ప్రారంభించి,
రాజుగా పట్టాభిషేకం జరిగాక తన పరిపాలన జరిగే రోజులలో ముగించాడు!
గ్రంధమునకు అర్ధము!
పరమగీతము అనగా పరలోకమునుండి వ్రాయబడిన గీతము కానేకాదు! నిజమైన
అర్ధము- గీతములు అన్నింటికంటే శ్రేష్టమైన గీతము! *హెబ్రీ భాషలో దీనిపేరు SHLR HASHRIM అని, గ్రీకులో ASMA ASMATON అని, లాటిన్
భాషలో CANTICUM అని పిలవబడుతుంది.* *ఈ పేర్లు
అన్నిటికి అర్థము ఒక్కటే పాటలకు పాట అని అర్థము.* అంతేకాదు దీనిని
సొలోమోను పాట అని, వధూవరుల సంభాషణ పాట అని కూడా అంటారు.
పరమగీతము యేసుక్రీస్తు సంఘానికి గల పవిత్ర స్నేహాన్ని వివరించే మృదుమధురమైన
సంభాషణ పాట. *పరమగీతము అంటే అత్యున్నత గీతము అని అర్థం చేసుకోవాలి,
*మానవ వివాహములోని ప్రేమ యొక్క పరిశుద్ధతను గౌరవమును మరియు సంతోషమును
చూపించుటకు పరిశుద్ధాత్మ దేవుని చేత వ్రాయబడిన గ్రంథమిది*. *వరుడు
క్రీస్తు ప్రభువు వారు, వధువు సార్వత్రిక సంఘము..*
*అధ్యాయాలు*
👉
8 ఎనిమిది
*వచనాలు*
👉
116 నూట పదహారు
*మూల వాక్యము*
👉
*(పరమ 7:10)*నేను నా ప్రియునిదానను అతడు నాయందు
ఆశాబద్ధుడు.
*(పరమ 8:6-7)* ప్రేమ మరణమంత బలవంతమైనది ఈర్ష్య పాతాళమంత
కఠోరమైనది దాని జ్వాలలు అగ్నిజ్వాలా సమములు అది యెహోవా పుట్టించు జ్వాల నీ హృదయముమీద
నన్ను నామాక్షరముగా ఉంచుము
నీ భుజమునకు నామాక్షరముగా నన్నుంచుము.
అగాధసముద్ర
జలము ప్రేమను ఆర్పజాలదు నదీ ప్రవాహములు దాని ముంచివేయజాలవు
ప్రేమకై యొకడు తన స్వాస్థ్యమంత ఇచ్చినను తిరస్కారముతో అతడు త్రోసివేయబడును.
*ముఖ్యమైన మనుషులు*
👉
సొలొమోను రాజు, షూలమ్మీతి, షూలమ్మీతి యొక్క సహోదరులు, యెరుషలేము కుమార్తెలు.
*భౌగోళిక స్థలాల పేర్లు మరియు వాటికి అర్థాలు ఈ పావురపు పాటలో
15 భౌగోళిక స్థలాలు పేర్కొనబడ్డాయి*
🔹🔹🔹🔹🔹🔹🔸🔸🔸🔸🔸
🇦.
కేదారు - నలుపు (1:5)
🇧.
ఐగుప్తు - చీకటి (1:9)
🇨.
ఏన్గేది - మేకపిల్ల యూట (1:14)
🇩.
షారోను - బయలు ప్రాంతం (2:1)
🇪.
యెరుషలేము - శాంతి నిలయం (2:7)
🇫.
లెబానోను - తెల్లనివి (3:9)
🇬.
గిలాదు - కరుకైన (4:1)
🇭.
అమాన – చిరుత (4:8)
🇮.
శేనీరు - కవచము (4:8)
🇯.
హెర్మోను - పరిశుద్ధమైనది (4:8)
🇰.
తిర్సా - సంతోషదాయకం (6:4)
🇱.
హెష్బోను - తెలివి (7:4 )
🇲.
దమస్కు- నిజమైన మారుమనస్సు (7:4)
🇳.
కర్మేలు - తోట లేక వనము (7:5)
🇴.
బయలు హామోను - సమూహములకు ప్రభువు/యజమాని (8:11)
దైవాశీస్సులు!
*గీతాలకు గీతము-పరమగీతము*
*మూడవ భాగము- ఉపోద్ఘాతము-3*
ప్రియులారా ఇక ఈ గ్రంధములో గల
ముఖ్యమైన వ్యక్తుల కోసం చూసుకుందాం!
సోలోమోను: దావీదుకు
బత్షెబా అనే అన్యురాలు
(హిత్తీయురాలు) కనిన కుమారులలో రెండవవాడు.
దావీదు పాపాన్ని బట్టి మొదటి బిడ్డను మొత్తగా చనిపోయాడు. ఆమె మరలా కుమారుని కనగా అతనికి సొలోమోను అని పేరు పెట్టాడు (2 సమూ 12:24). దేవుడైతే అతనికి నాతాను ప్రవక్త ద్వారా యదీద్యా
అనగా యెహోవాకు ప్రియుడు అని పేరు పెట్టించాడు. కారణం అతని కాలంలో
యుద్ధాలు లేవు శత్రువులు లేరు. బత్షెబా ఇతనికి లెమూయేలు అని పేరు
పెట్టింది. అంటే యెహోవాకు సమర్పించబడినవాడు అని అర్థం.
ప్రజలు అతనికి ప్రసంగి అని పేరు పెట్టారు. నాలుగు
నామధేయాలు కలవాడు ఇతడు. సింహాసనం ఎక్కేటప్పటికి 20 సంవత్సరాలు. 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. యెరుషలేము దేవాలయాన్ని
7 సంవత్సరాలలో, అతని నగరును 13 సంవత్సరాల్లోనూ కట్టించాడు...
షూలమ్మితి:
షూలమ్మీతి అనే కన్యక ఇశ్శాఖారు గోత్రానికి చెందినది. ఆమె నివాసం షూనేము అనే
గ్రామం. రాజైన సొలొమోను పరిపాలనలో ఈ గ్రామాలు అతని స్వాధీనములో
ఉండేది. షూలమ్మీతిని ఒకనికి ప్రధానం చేశారు. ఈ కన్యక సోదరులు ఈమెను ద్రాక్ష తోటకి కావలిగత్తెగా ఉంచారు. సొలోమోను సేవకులలో ఒకడు షూలమ్మీతిని తెచ్చి రాజనగరిలోనున్న స్త్రీల మధ్య ఉంచాడు.
ఇది షూనేమీయుల అలవాటు. (1 రాజులు
1:1-4) లో దీనికి ఋజువు కలదు. యాకోబు చనిపోకముందు
తన కుమారులు అందరినీ పిలిచి ఒక్కొక్కని భవిష్యత్తును ప్రవచించాడు. "ఇశ్శాఖారు.... భూమి రమ్యమైనదగుట చూచెను. గనుక అతడు మోయుటకు, భుజము వంచుకుని వ్యక్తి చేయు దాసుడగునని"
(ఆది 49:14-15)లో ఆశీర్వదించాడు. ఈ కారణాన ఈ గోత్రికులు దాసత్వం చేసేవారు. షూలమ్మీతి దాసి,
మనము కూడా దాసులము.
పాపానికి బానిసలం. ఆయనే మనలను విమోచించి ఘనపరిచాడు.
*గ్రంథములో ఉన్న ఇతర అంశాలు*
🟠🟢🟤🟣🔴🟡🟡🔵⚫
🇦. *పరలోక వరుడు*
🟣🟣🟣🟡🟡🟡🟢🟢🟢
1️⃣.
వధువులోని లోపాలన్నిటిని అతని ప్రేమ కనిపిస్తుంది
(4:7)
2️⃣.
అతడు ఆమెను చూచి హర్షిస్తాడు యెషయా (65:7)
3️⃣.
ఆమె కోసం తన ప్రాణం ఇచ్చాడు (ఎఫెసీ
5:25 )
4️⃣.
ఆమెను తనదిగా చేసుకునేందుకు వస్తాడు (మత్తయి
25:6)
*🇧.వధువు*
🟠🟠🟠🟠🔵🔵🔵🔵🔴🔴🔴
1️⃣
. వరుణ్ని ప్రేమిస్తున్నది (2:16)
2️⃣.
తన అయోగ్యతను గుర్తించినది (1:5)
3️⃣.
శుద్ధురాలై మచ్చలేని దుస్తులు ధరించింది ప్రకటన (19:8)
4️⃣.
దైవ కృప అనే ఆభరణాలు ధరించినది (యెషయా
61:10)
5️⃣.
వివాహానికి ఆహ్వానం పంపిస్తున్నది (ప్రకటన
22:17)
🇨. *పెండ్లి విందు*
🟡🟡🟡🟢🟢🟢🟢🟢
1️⃣.
తన కుమారుడి కోసం తన సిద్ధపరిచాడు (మత్తయి
20:22)
2️⃣.
ఖరీదైన ఏర్పాట్లు జరిగాయి (మత్తయి
22:4)
3️⃣.
దానికి ఆహ్వానము పొందడం గొప్ప గౌరవం (ప్రకటన
19:9)
4️⃣.
ఆహ్వానాన్ని అనేకమంది తిరస్కరించారు (మత్తయి
20:25)
5️⃣.
అన్ని తరగతుల ప్రజలకు ఆహ్వానాలు అందాయి (మత్తయి 22:10)
6️⃣.
పెండ్లి దుస్తులు లేకపోతే పెండ్లిలో స్థానము లేదు (మత్తయి 22:11-13)
*గ్రంథములను ప్రస్తుత కాలమునకు అన్వయించుట*
1️⃣.
విశ్వాసము మరియు కాముకత్వము*
🔸🔸🔸🔸🔸🔹🔹🔹🔹🔹🔹
👉 పరమగీతములలోని దేవుని ప్రస్తావన రాలేదు కానీ
తెరవెనుక కనిపించేది యెరుషలేము రాజ భవనం. కాబట్టి ఇశ్రాయేలు దేవుని
మీద విశ్వాసం ఉంచుకొనవలెను. సమకాలీన వ్యవస్థలో లైంగిక ఉల్లాసము,
ఉత్సాహము, క్రైస్తవ విశ్వాసమునకు సరిపోయింది కాదు.
వివాహము అనే హద్దులో అనే దానిని అనుభవించాలి. తగు
సమయములో శృంగారపరమైన సంబంధము సంతోషించుటకు దేవుడిచ్చిన ఒక బహుమానం.
Sex without marriage is adultery. Sex with unauthorized person
that is with otherthan his/her licensed wife/Husband is also sin and adultery!
Sex with same gender is hateful sin! So sex accepted in the frame of Holy
marriage is accepted and given by God Almighty!!
*2️⃣. ప్రేమలో పాఠములు*
🔹🔹🔹🔹🔹🔸🔸🔸🔸🔸
👉
పురాతన పద్యములలో మానవ ప్రేమ విలువలు ఎన్నటికి మారనివి. అందుచేత పరమగీతములు నేటి కాలంలో దాని వివరణ ఎంతో చెప్పవలయును.
*3️⃣. ఓపిక మరియు
శక్తి*
🔸🔸🔸🔸🔹🔹🔹🔹🔹
👉
పరమగీతములలోని ప్రారంభము యవ్వన స్త్రీ చెప్పుచున్నది - ప్రేమ కోరుకున్నంతవరకు లేప వద్దని, కలతపరచవద్దని
(పరమ 2:7;3:5;8:4). ప్రేమ తత్సంబంధమును ఇద్దరు
ప్రేమికులు దగ్గరై వృద్ధి చేసుకొనుటకు ఒక చిన్న సలహా. ఈ సలహా
ఈ పుస్తకం అంతయూ పదేపదే చెప్పబడింది. ప్రేమ సంబంధమైన విషయములయందు
ఓపిక కలిగి ఉండాలి. వివాహము ద్వారానే ఈ సంబంధము పెరగాలి.
అప్పుడా ప్రేమ స్థిరంగా, బలంగా ఉంటుంది.
*4️⃣. స్వచ్ఛత*
🔸🔸🔸🔸🔸🔹🔹🔹🔹
👉 ఈ యవ్వన స్త్రీ ఒక తాళం
వేసిన ఉద్యానవనము. ఆమె పురుషుడు దానిలోనికి ప్రవేశించుటకు పూర్ణ
స్వాతంత్ర్యము కలవానిగా చెప్పబడుచున్నది (పరమ 8:12). హద్దు మీరిన పరిణామములు స్త్రీపురుషులిద్దరికీ సంబంధించినవి.
*5️⃣. దేవుని క్రీస్తు
యొక్క ప్రేమ*
🔹🔹🔹🔹🔹🔸🔸🔸🔸🔸
👉
పరమగీతము మానవ సంబంధము వలె గాక అది దేవునికి, తన
ప్రజలకు గల సంబంధమును కూడా చెప్పుచున్నది. పరమగీతములు యూదుల పస్కా
పండుగ ప్రారంభ సమయంలో దేవుని ఉద్రేకపూరితమైన ప్రేమకు ఆనవాలుగా, దేవుని నిబంధనకు గుర్తుగా చదవబడును. ఇది నూతన నిబంధనలో
వివాహ సంబంధమును గూర్చి చదవబడును (ఎఫేసీ 5:25). అతిశయింపదగిన ప్రపంచము మీద మానవ ప్రేమపై
సృష్టికర్త అయిన దేవుని జ్ఞాపకము చేయునది ఉన్నది ఆయనకు గల పరిపూర్ణమైన, మహోన్నతమైన ప్రేమను తెలియజేయునది..
*గ్రంథములో ప్రభువైనయేసుక్రీస్తు వారి ప్రస్తావన*
🔴🔴🔴🔴🔴🔵🔵🔵��🟠🟠🟠
👉
(హెబ్రీ 13:4) లో ఇలా వ్రాయబడినది. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పాన్పు నిష్కల్మషమైనదిగాను
ఉండవలెను. వేశ్యాసంగులకును, వ్యభిచారులకును
దేవుడు తీర్పు తీర్చును. దేవునికి, ఇశ్రాయేలునకు
మధ్య ఉన్న సంబంధము మరియు సంఘ వధువునకును వరుడైన క్రీస్తు సంబంధముల ఉపమాలంకారములు అని
కూడా అర్ధము చేసుకొనవచ్చును. కొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు
వారి ప్రేమ సంఘము పట్ల ఎలా ఉన్నదో అది భార్య భర్తల సంబంధానికి పరిశుద్ధమైన ప్రేమకు
ఉదాహరణలు (2 కొరింధి 11:2) (ఎఫెసీ
5:22-23) (ప్రకటన 19:7-9;21:1,2,9) ఈ గ్రంథములో
ప్రభువైన యేసుక్రీస్తు వారు మన ఆత్మకు ప్రియునిగా ఉన్నాడు....
దైవాశీస్సులు!!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*నాల్గవ భాగము*
పరమగీతము 1:1—2
1 సొలొమోను రచించిన పరమగీతము.
2 నోటిముద్దులతో అతడు నన్ను ముద్దుపెట్టుకొనును గాక నీ
ప్రేమ ద్రాక్షారసముకన్న మధురము.
ప్రియులారా!
దేవునికి మహిమ కలుగును గాక! ఇంతవరకు మనము ఉపోద్ఘాతములో
అసలు ఈ దివ్యమైన పుస్తకము బైబిల్ లో పరిశుద్ధాత్ముడు ఎందుకు ఉంచారు? ఈ పుస్తకము యొక్క నేపధ్యము ఏమిటి? విశేషము ఏమిటి?
సోలోమోను ఎవరు? షూలమ్మితి ఎవరు? అనేది చూసుకున్నాము! ఇక ఈ పుస్తకములో గల ఆత్మీయ మర్మాలు
ధ్యానం చేసుకుందాము! గమనించాలి- నేను బైబిల్
స్కాలర్ గాని బైబిల్ పండితుడిని గాని కాను! నాకు వేదాంత విధ్య
డిగ్రీలు కూడా లేవు! గాని నా చిన్నతనములో మరియు యవ్వనములో నా
తండ్రిగారు అపోస్టలులు లూకా గారు, ఇంకా అనేకమంది దైవజనులు చెప్పిన
ప్రసంగాలు విని నేర్చుకున్నాను మరియు అనేకమంది దైవజనులు రచించిన పుస్తకాలు చదివి నేర్చుకుని పరిశుద్దాత్ముని
పాదాలు దగ్గర అడిగి పొందుకుని రాస్తున్నాను తప్ప నాకు ఈ విషయంలో విజ్నానము లేదు!
కాబట్టి నేను రాసిందే నిజమైన వ్యాఖ్యానము అని కాదు! సరియైనదిగా కనిపిస్తే తీసుకోండి! వాక్యము గద్ధిస్తే సరిచేసుకోండి!
హెచ్చరిస్తే హెచ్చరిక పొందండి! ఒకవేళ నేను వ్రాస్తున్నది
వాక్య విరుద్దముగా ఉన్నా, లేక సరియైన అర్ధముగా అనిపించకపోయినా
దయచేసి నాకు తెలియజేయండి. అవసరమైతే సరిదిద్దుకుంటాను!
గమనించాలి- ఉపోద్ఘాతములో చెప్పిన
విధముగా రెండు కోణాలు అనగా వాక్యములో ఉన్న సూటి ఆత్మీయ మర్మము మరియు దేవుడు అబ్రాహాము
గారిని పిలుచుకుని ఆయనకు స్వకీయ జనముగా చేసుకుని- రాజ్యమునిచ్చి-
వారి పాపములకు చెరలోకి బబులోనూ పంపించి తిరిగి రప్పించి- యేసుక్రీస్తు ప్రభులవారిని ఈ లోకానికి పంపించి- పాప పరిహారము
జరిగించి- శిలువ మరణ పునరుత్థానము తర్వాత సంఘమును స్థాపించడం-
రెండవరాకడ – వెయ్యేళ్ళ పాలన కోణములోనూ ఈ గ్రంధమును ధ్యానం చేద్దాం!
ఇక మొదటి వచనములో సోలోమోను రచించిన పరమగీతము అని వ్రాయబడి ఉంది గనుక ఇది సోలోమోను
గారు తన యవ్వనములో ఇంకా పట్టాభిషిక్తుడు కాకముందే ఈ గ్రంధమును వ్రాయడం ప్రారంభించారు! అనేకమంది అపోహపడినట్లు
దీనిని వ్రాసినది ఎవరో గాని సోలోమోను తన పేరు పెట్టుకున్నాడు అనేది సత్యదూరము అని గ్రహించాలీ!
మనము మొదటగా ఈ రోజు సొలోమోను అంటే అర్థం
ఏమిటి దానిద్వారా మనము ఏమి నేర్చుకోవచ్చో తెలుసుకుందాము!!!
సోలోమోను అనగా సమాధాన కర్త! సోలోమోనుకు
నాలుగు పేరులు ఉన్నట్లు గతభాగాలలో చూసుకున్నాము! దావీదు గారు
పెట్టిన పేరు సోలోమోను! నిజానికి సమాధాన కర్త ఎవరు అనగా యేసుక్రీస్తు
ప్రభులవారు! యెషయా 9:6 ప్రకారం
6 ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద
రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు
తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. యేసుక్రీస్తు
ప్రభులవారు సమాధాన కర్త- ఇంగ్లీష్ లో Prince of
Peace. కాబట్టి అక్షరార్ధముగా ఈ ప్రేమ గీతము సోలోమోను గారు షూలమ్మితి
కి వ్రాసిన ప్రేమలేఖ గాని ఆత్మీయముగా ఈ లేఖ యేసుక్రీస్తు ప్రభులవారు తన స్వరక్తమిచ్చి
సంపాదించుకున్న తన సంఘానికి వ్రాసుకున్న ప్రేమలేఖ అని అర్ధమవుతుంది!
ఇక రెండవదిగా దేవుడు తన ప్రవక్త ద్వారా చెప్పిన పేరు యదీధ్యా! అనగా అనగా
యెహోవాకు ప్రియుడు! దీనికోసం ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభులవారి
కోసం దేవాడిదేవుడు తండ్రియైన దేవుడు చెప్పారు మత్తయి మార్కు లూకా సువార్తలలో ఈయన నా
ప్రియ కుమారుడు! మత్తయి 3:17; 12:18; 17:5; మార్కు 1:11; లూకా 3:22 కారణం ఆయన
తండ్రికి ప్రియమైన వ్యక్తిగా జీవిస్తూ దేవుడు ఏమి చేయాలని కోరుకున్నారో అదే పనులు మాత్రమే
చేశారు! మనము కూడా మన జీవితాలలో దేవునికి ఇష్టమైన పనులు మాత్రమే
చేస్తూ దేవునికి ప్రియులుగా జీవించవలసిన వారమై ఉన్నాము! సామెతలు
16:7 ప్రకారము మన ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉండాలి! కాబట్టి యదీధ్యా అనగా యెహోవాకు ఇష్టుడు లేక ప్రియుడు- గాని నిజానికి సోలోమోను గారు తన జీవిత చరమాంకంలో దేవునికి ఇష్టుడుగా ఉండక దేవునికి
వ్యతిరేఖంగా జీవించి శపించ బడ్డాడు! గనుక ఇక్కడ యదీధ్యా సోలోమోను
కాదు యేసుక్రీస్తు ప్రభులవారే- కనుక ఈ లేఖ యేసుక్రీస్తు ప్రభులవారే
రాశారు అని గ్రహించాలి!
ఇక మూడవదిగా సోలోమోను గారి
తల్లి బత్సెబా సోలోమోనుకి లెమూయేలు అని పేరు పెట్టింది. లెమూయేలు అనగా దేవుణ్ణి హత్తుకునే వాడు! సోలోమోను తన జీవిత ఆరంభములో దేవుణ్ణి హత్తుకున్నాడు గాని చివర్లో విగ్రహాలను
కాముకత్వాన్ని హత్తుకున్నాడు! కానీ యేసుక్రీస్తు ప్రభులవారు కేవలం
తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే నేను వచ్చాను అని చెబుతూ తండ్రికిష్టమైన కార్యాలు
మాత్రము చేస్తూ దేవుణ్ణి హత్తుకున్నారు! మనము కూడా మన జీవితములో
రూతు గారు అత్తగారైన నయోమీ గారిని హత్తుకున్నట్లు మనము యేసుక్రీస్తు ప్రభులవారిని హత్తుకుని
జీవించాలి! రూతు గారు అన్నారు- నీ జనమే
నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు ఎక్కడ మరణిస్తావో అక్కడే నేను కూడా చనిపోవాలి- మరణము
తప్ప మనలను మరి ఏదీ విడదీయ లేదు అని హత్తుకుంది. అలాగే మనము కూడా
జీవించవలసిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా! కాబట్టి ఈ పేరును
బట్టి చూసినా ఇది యేసుక్రీస్తు ప్రభులవారే రాసిన ప్రేమలేఖ అని గ్రహించాలి!
ఇక ప్రజలు పెట్టిన పేరు- ప్రసంగి: అనగా అనేకమైన మంచి
ప్రసంగాలు చేసిన వాడు- అవును సామెతలు గ్రంధము ప్రసంగి గ్రంధాలలో
అనేకమైన జీవిత సత్యాలు చెప్పిన వాడు సోలోమోను. అందుకే ఆయనకు ప్రజలు
ప్రసంగి అని పేరు పెట్టారు! అయితే నాలుగు సువార్తలలో యేసుక్రీస్తు
ప్రభులవారు చేసిన ప్రసంగాలు నిజానికి పరలోకమునకు మనలను నడిపించే సత్యాలు! ముఖ్యంగా కొండమీద ప్రసంగానికి సాటియైన ప్రసంగం ఈ ప్రపంచంలో ఏదీ లేదు!
దానికి మించిన ప్రసంగం ఎవరూ చేయలేరు! కాబట్టి ఈ
రకంగా చూసుకున్నా ఈ పరమగీతము అనేది ప్రేమలేఖ యేసుక్రీస్తు ప్రభులవారు వధువు సంఘానికి
వ్రాసిన ప్రేమలేఖ గా నిర్ధారణ అవుతుంది!
దైవాశీస్సులు!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*ఐదవ భాగము*
*నోటిముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టు కొనును గాక!*
పరమగీతము 1:1—2
1 సొలొమోను రచించిన పరమగీతము.
2 నోటిముద్దులతో అతడు నన్ను ముద్దుపెట్టుకొనును గాక నీ
ప్రేమ ద్రాక్షారసముకన్న మధురము.
ప్రియులారా! ఇక రెండవ వచనం చూసుకుంటే నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనును గాక!
నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము అని చెబుతున్నారు! నిజానికి ఈ మాట షూలమ్మితి తన ప్రియుడైన సోలోమోను కోసం చెబుతున్న మాట ఇది!
నోటి ముద్దులు ఎవరు ఎవరికి ఇస్తారు అని ఆలోచిస్తే- మొదటగా ప్రపంచం మొత్తంలో
తల్లిదండ్రులు తమ చంటి బిడ్డలకు ఎన్నెన్నో నోటిముద్దులు ఇస్తారు ప్రేమతో! గనుక మొదటగా తండ్రియైన దేవుడు కుమారుడైన దేవుడు తన పిల్లలైన మనకు అనగా మానవాళికి
తన అమూల్యమైన నోటితో ముద్దులు ఇస్తున్నారు. అలా నాకు దేవుడు ముద్దులు
ఇవ్వాలి అని షూలమ్మితి కోరుకుంటుంది ఇక్కడ!
ఇక రెండవదిగా ప్రపంచములో అనేక ప్రాంతాలలో తెలిసిన వారిని లేక
ఇంటికి వచ్చిన వారిని గ్రీట్ చేస్తూ ముద్దు పెట్టుకోవడం ఆనవాయితీ! మనకు రెండు
చేతులతో నమస్కారం చేయడం ఎలానో, పాశ్చాత్య దేశాలలో షేక్ హండ్స్
ఇవ్వడం ఎలాగో అలాగే చాలా దేశాలలో ఇంటికి వచ్చిన వారిని తెలిసిన వారిని ముద్దుపెట్టుకోవడం
ఆనవాయితీ! ఇక్కడ దేవుడు అన్యులమైన మనలను తన ప్రేమతో ప్రేమించి
మనలను క్రీస్తు రక్తము ద్వారా మన పాపములను కడిగి పవిత్రులుగా చేసి ఇప్పుడు నా ప్రియమైన
వాడా నా ప్రియురాలా అంటూ మనలను ముద్దు పెట్టుకుంటున్నారు! అబ్రాహాము
గారు పిలువబడిన కోణములో చూసుకుంటే అబ్రాహాము గారు విగ్రహారాధనకు చెందిన కుటుంబంలో పుట్టిన
వాడు! గాని దేవుడు అబ్రాహాము గారిని నీ జనమును విడిచి నీ ప్రజలను
బందువులను విడిచి నేను చూపించే దేశములోకి రా! నిన్ను ప్రత్యేకమైన
జనముగా చేసి నీ ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాను అని పిలువగా ఆ ఆజ్నకు పిలుపుకు అబ్రహాముగారు
లోబడ్డారు! దేవుడు చెప్పినట్లు చేయగా దేవుడు అబ్రాహామును దీవించారు!
ముద్దుపెట్టుకున్నారు! మనలను కూడా అదే పిలుపుతో
పిలిచారు దేవుడు యేసుక్రీస్తు సువార్త ద్వారా! దానికి లోబడి సువార్త
సత్యమును గ్రహించిన సంఘానికి దేవుడు యేసుక్రీస్తు ప్రభులవారు ముద్దు పెట్టుకోడానికి
సిద్ధంగా ఉన్నారు!
అయితే మనము ఎందుకు పిలువబడ్డాము గతభాగాలలో విస్తారంగా విశ్వాసులు ఎందుకోసం
పిలువబడ్డారో ధ్యానం చేసుకున్నాము!
ఏసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షించబడడానికి
పిలవబడ్డాము!
రోమా 1:2 ప్రకారము
పరిశుద్ధులుగా ఉండడానికి పిలవబడ్డాం! కాబట్టి మనం పరిశుద్ధులుగా
జీవించాలి! ఎందుకంటే మన పిలుపు సామాన్యమైనది కాదు భవిష్యత్ జ్ఞానము
బట్టి మనల్ని పిలుచుకున్నారు.
కాబట్టి రాజులైన యాజకులుగా మన పిలుచుకున్నారు
కాబట్టి పిలుపుకు తగిన జీవితము మనము జీవించాలి! పరిశుద్ధులుగా
ఉండాలి!
మనము దేవుని పరిశుద్ధులుగా అపోస్తులుగా
బోధకులుగా కాపరులుగా ఇంకా దేవుని పని చేయడానికి పిలువబడ్డాము!
ఇక 1కొరింథీ
7:22 ప్రకారము స్వాతంత్రం పొందడానికి పిలవబడ్డాము!
హెబ్రీ 9:15 ప్రకారం నిత్యమైన స్వాస్త్యము పొందడానికి పిలవబడ్డాము!
ఇంకా చీకటి నుండి వెలుగులోనికి పిలువబడ్డాము
కాబట్టి ఆయన గుణాతిశయాలు ప్రకటించడానికి కూడా పిలవబడ్డాము!
ఇక తర్వాత దేవుని యొక్క దీవెనకు ఆశీర్వాదాలు
వారసులవ్వడానికి పిలవబడ్డాము మొదటి పేతురు 3:9 ప్రకారం!
మొదటి పేతురు 5:10 ప్రకారం శాశ్వత మహిమకు పిలవబడ్డాము!
ప్రకటన 19:9 ప్రకారం గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడ్డాము!
ఇంకా ఏసుక్రీస్తు ప్రభువుల వారియొక్క
వారుగా, ఆయన వారుగా ఉండటానికి పిలవబడ్డాను!
కాబట్టి విధేయులగు పిల్లలవలే మీ పూర్వపు
అజ్ఞాన దశలో ఉండకుండా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము సమస్త ప్రవర్తనయందు
పరిశుద్ధులై ఉండుడి అని పేతురు గారు ఇదే అధ్యాయంలో చెబుతున్నారు
1
Peter(మొదటి పేతురు) 1:15,16
15. కాగా మీరు విధేయులగు పిల్లలై, మీ పూర్వపు అజ్ఞానదశలో
మీ కుండిన ఆశల ననుసరించి ప్రవర్తింపక,
16. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు
పరిశుద్ధులైయుండుడి.
యేసయ్య అంటున్నారు పిలువబడిన వారు
అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే!!! మరి నువ్వు పిలవబడ్డావు కదా
మరి నువ్వు ఏ గుంపులో ఉన్నావో తెలుసుకో!!!
ఇక మూడవది నోటి ముద్దులు పెట్టుకునేది ప్రేమికులు! ప్రియుడైన
సోలోమోను తనను తనివితీరా ముద్దుపెట్టుకోవాలి అని షూలమ్మితి ఆశిస్తుంది ఇక్కడ!
అలాగే సంఘము కూడా యేసుక్రీస్తు ప్రభులవారు తనను ప్రేమించాలి ముద్దుపెట్టుకోవాలి
అని ఆశించాలి!
ప్రేమను
అనేక రకములుగా వ్యక్తపరచవచ్చును. అందులో నోటి ముద్దుతో వ్యక్తపరచుట
అందులో ఒకటి. మన మూలవచనములో
ప్రియుడు ప్రియురాలిని ముద్దిడి నట్లుగా వ్రాయబడింది. ఈ ముద్దులోని
మాధుర్యమును గూర్చి ప్రియురాలు ద్రాక్షారసము లోని మాధుర్యము కన్నా ప్రియమైనదిగా ప్రియుడి
ప్రేమ తనకు కనబడుచున్నట్లుగా చెప్పబడింది.
ఇందులో అతడు నన్ను ముద్దుపెట్టుకొనునని ప్రియురాలు చెప్పుచున్నది. ఇందులో క్రీస్తు ప్రభువు ప్రియురాలైన
సంఘమును ఏ విధముగా ముద్దు పెట్టుకొనుట జరుగును? ఎఫెసీ
5:27, ''అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి, అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైననులేక, పరిశుద్ధమైనదిగాను,
నిర్దోషమైనదిగాను మహిమ గల సంఘముగాను ఆయన తనయెదుట దానని నిలువబెట్టుకొనవలెనని,
వాక్యముతో ఉదకస్నానముచేత దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై
దానికొరకు తన్ను తాను అప్పగించుకొనెను.''
ఇందులో క్రీస్తు ప్రభువుకు భార్యగా సంఘమును గూర్చి చెప్పబడింది. ఈ సంఘము పరమయెరూషలేముగా యుగాంతములో
మారి యేసుక్రీస్తు ప్రభులవారి భార్యగా మారును. ప్రకటన 21:9-10, ''అంతట ఆ కడపటి యేడు తెగుళ్లతో నిండిన యేడు పాత్రలను పట్టుకొనియున్న యేడుగురు
దేవదూతలలో ఒకడు వచ్చి -ఇటు రమ్ము, పెండ్లికుమార్తెను,
అనగా గొఱ్ఱెపిల్లయొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి, ఆత్మవశుడనైయున్న నన్ను యెత్తయిన గొప్ప పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదై పరలోకమందున్న
దేవుని యొద్దనుండి దిగివచ్చుట నాకు చూపెను.'' ఈ విధముగా యుగాంతము తరువాత ఈ సంఘము
పరమయెరూషలేముగా మారును గనుక దీనికి ముందు అనగా ఇప్పుడు అనగా ఈ లోక సృష్టి మొదలు యుగాంతము
వరకు ఆమె భార్య కాదు కదా! అంటే ఎవరు కన్య. కన్య పురుషునికి ప్రియురాలుగా ఉండును. అంతేగాని భార్య కాదు. భార్యగా ఎప్పుడు మారును? వివాహము తరువాత. కనుక సంఘము క్రీస్తు ప్రభువుకు ప్రియురాలుగాను
క్రీస్తు ప్రభువును సంఘమునకు ప్రియుడుగాను ఇందులో వర్ణించుట జరిగింది.
ఇందులో
సంఘము అంటే ఎవరు? పరిశుద్ధులు అనగా జీవాత్మలమైన మనమే! ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు
విశ్వాసముంచుకొని సంఘములో భాగస్థులమై జీవిస్తామో, ఎవరి క్రియలు
సంఘములో అంత్య దినములలో పరిశుద్ధాత్మ పరీక్షించినప్పుడు నిలుచునో వారందరు సంఘముగానే
నిర్ణయించబడుదురు. కనుక
మనమందరము ఏకమైనప్పుడు
ప్రియురాలుగాను, విడి విడిగా ఉన్నప్పుడు కన్యలుగాను వర్ణించబడింది. ఎలా? మనము విడివిడిగా ఉంటే కన్యకలుగా లెక్కింపబడుదుము. మనమందరము సంఘములో ఏకమైతే పరమయెరూషలేముగా
మారుదుము గనుక క్రీస్తు ప్రభువుకు ప్రియురాలుగా మారి చివరకు వివాహానంతరము భార్యగా మారుదుము.
ఇందునుగూర్చి ఎఫెసీ 5:22-33 సవివరముగా వివరిస్తున్నది. అందుకే ఈ పరమగీతములోని వర్ణన చదివేవారికి
ఆత్మరీత్యా కొంత ఈ లోకరీత్యా కొంత ఉన్నట్లుగా అర్థమై తికమకకు గురి చేస్తున్నది,
ఎందుకంటే క్రీస్తు ప్రభువు ప్రియునిగా నూతన నిబంధన కాలము వరకు అదృశ్యములోఉన్నాడు,
నూతన నిబంధనకాలములో ఈ లోకములో భూమిపై యున్నారు. అటుతరువాత మరల అదృశ్య రూపములో ఉన్నారు. యుగాంతము తరువాత
రెండవ రాకడలో వచ్చి సంఘమును
తన భార్యగా చేసుకొనును. అలాగే ఈ సృష్టి మొదలు సంఘము ఈ లోకములో
ఉన్నది. ఈ సంఘము యుగాంతము
వరకు ఈ లోకములో క్రియ జరిగించును. కాని సంఘము రెండుగా విడిపోయి కొందరు పరదైసులలోను కొందరు ఈ లోకములో ఉన్నారు. ఎలా? మనకు ముందు తరములవారు ఈ లోకములో సంఘములో
కన్యకలుగా ఉండి వారి మరణానంతరము పరదైసులలో చేర్చబడుచున్నారు. కనుక సంఘము అనగా ప్రియురాలు రెండు ప్రాంతాలలో తన కార్యములు కొనసాగించుచున్నది.
అందులో పరదైసులో చీకు చింత లేక ఆనందముగా ఉంటే ఈ లోకములో సాతాను సమాజము
క్రీస్తు సంఘముతో నిరంతరము పోరాటము కొనసాగుచున్నది. ఇలాంటి ప్రియురాలిని క్రీస్తు ప్రభువు
తన నోటి ముద్దులుతో తన ప్రేమను ఆమెకు చూపుట బహు ఆశ్చర్యముగా లేదా!
ఈ ప్రేమను
గూర్చి మనము ఆలోచిస్తే క్రీస్తు ప్రభువు దేవుని కుమారుడై ఉండి మనకోసము ఈ లోకములో కన్యక
ద్వారా జన్మించి సిలువ బలియాగమునకు ముందు తన ప్రేమను వ్యక్తపరచుట బల్ల భోజనము ద్వారా
చూపుట జరిగింది. అంత
ఉన్నత స్థానములోని రాజు మనకోసము సాధారణ వ్యక్తిగా ఈ లోకములో జన్మించి జీవించుట ప్రేమకు
నిదర్శనము కాదా! ఈ ప్రేమ ప్రభు భోజనమును పుచ్చుకొనునప్పుడు ఆయన
మనలను ముద్దిడుచున్నట్లుగా భావించుకొనుచు ఆ మధురమును మనము ఆస్వాదించాలి. ఈ మధుర ద్రాక్షారసమును బల్ల ఆరాధనలో
త్రాగుట కన్న మధురమైనది. కొద్దిగా పులియని ద్రాక్షారసము నోటికి తగిలినప్పుడు అది చాలా మధురముగా అనిపిస్తుంది
కాని ఆయన ప్రేమను మనము ఇందులో ఆస్వాదిస్తే అత్యంత మధురమైనదిగా తెలుస్తుంది. ఈ విధముగా ప్రియుడు ప్రియురాలిని
విడరాని బంధముగా ముద్దు పెట్టుకోవాలని, ప్రియురాలైన సంఘము అందులోని
కన్యకలమైన మనము ఆశించాలి.
మరి నీవు అలా ఆశించడానికి ఇష్టపడుతున్నావా?
దైవాశీస్సులు!
*గీతాలకు గీతము-పరమగీతము*
*6వ భాగము*
*నీ పేరు పోయబడిన పరిమళతైలము*
పరమగీతము 1:3
నీవు పూసికొను పరిమళతైలము సువాసనగలది నీ పేరు పోయబడిన పరిమళతైలముతో
సమానము కన్యకలు నిన్ను ప్రేమించుదురు.
ప్రియులారా! ఇక మూడవ వచనం చూసుకుంటే నీవు పూసికొను పరిమళతైలము
సువాసనగలది నీ పేరు పోయబడిన పరిమళతైలముతో సమానము కన్యకలు నిన్ను ప్రేమించుదురు అని
షూలమ్మితి చెబుతుంది సోలోమోను కోసము!!
ఇక్కడ “పేరు” ఒక వ్యక్తి స్వభావాన్నీ లక్షణాలనూ సూచిస్తున్నది.
పాత నిబంధనలో యెహోవా అనే పేరు, క్రొత్త నిబంధనలో
యేసు అనే పేరు పరలోకం నుంచి భూమిమీదికి ఒలికి ప్రపంచవ్యాప్తంగా పరిమళాలను విరజిమ్మిన
సుగంధ తైలాలు. నిర్గమకాండము 30:22-38, ; కీర్తనల గ్రంథము 45:8, ; మత్తయి 26:6-13, పోల్చిచూడండి. ఆధ్యాత్మికంగా పవిత్రులు (ఇక్కడ “కన్యలు” ఇలాంటివారికి సూచన)
దేవుణ్ణే అన్నిటికంటే పైగా, ఎక్కువగా ప్రేమిస్తారు.
సరే, ఇక్కడ నీవు పూసికొను పరిమళ తైలము సువాసన గలది అంటుంది షూలమ్మితి! అది ఆయన పేరే అని మీద చెప్పుకున్నాము!
యేసునామము పవిత్రమైనది పరిశుద్ధమైనది అమూల్యమైనది. పాపిని పరిశుద్ధినిగా
చేసేది. దయ్యాలు భయపడి వణికి పోయేది. ముఖ్యంగా
నిరాశలలో ఉన్నవారికి ఆశ కలిగించేది- ఆదరణ లేనివారికి ఆదరణ ఇచ్చేదీ
ఏసునామమే! అట్టివారికి ఈ యేసు నామము పరిమళ తైలమే!
నిజానికి అబ్రాహాము గారి తర్వాత యాకోబు సంతానములో ఆహారోను వచ్చాడు- ఆ ఆహారోను
తలమీద పరిమళ తైలము ప్రోక్షించ బడింది దేవునికి యాజకునిగా అభిషేకించ బడ్డాడు ఆహారోను!
నిర్గమ 29:7 లో చెప్పబడినట్లు! ఇదే అభిషేకమునకు సాదృశ్యముగా ఈ అంత్య దినాలలో తన సేవకుల మీద పరిశుద్ధాత్మ అభిషేకము
తైలము వలె కుమ్మరించ బడింది కుమ్మరించబడుతుంది! పాత నిబంధనలో
ఆహారోను ప్రధాన యాజకునిగా ఉంటే ఈ క్రొత్త నిబంధనలో మెల్కీసేదేకు క్రమంలో యేసుక్రీస్తు
ప్రభులవారు ఉన్నారు! ఈయన మీద పరిశుద్ధాత్మ దేవుడు పావురము వలె
వ్రాలి నట్లు యోహాను 1:32 లో చూడగలము! అప్పటినుండి
యేసుక్రీస్తు ప్రభులవారు దేవుని పనికి తనను తాను సమర్పించు కున్నట్లు మనము చూడగలము!
ఆదేవిధముగా పరిశుద్ధాత్మ అభిషేకము పొందుకున్న ప్రతీ విశ్వాసి దేవుని
పనికోసం పాటుపడాలి! కష్టపడాలి!
అదే పరిమళ తైలముతో ప్రభువు పాపులను విమోచన చేశారు రక్షించారు, ఇంకా తన పేరు కొరకు ప్రతిష్టించారు
అదే పరిమళ తైలముతో మానవులను తన ప్రజలుగా అభిషేకించారు దేవుడు! మనము కూడా ఇదే పరిమళ తైలము పొందుకుని అనేకులను ప్రభు చెంతకు రప్పించాలి!
ఇక పరిమళ తైలము ఎంతో సువాసనగా ఉంటుంది. పరిమళ తైలము అనగా సెంటు!
ఈ సువాసన మనము అందరికీ వెదజల్ల వలసి ఉంది! క్రీస్తు
కూడా మనకొరకు నీళ్ళ వలె పోయబడి మనకు సువాసనగా అప్పగించబడ్డాడు కీర్తన 22:14 ప్రకారం!
14 నేను నీళ్లవలె పారబోయబడి యున్నాను నా యెముకలన్నియు
స్థానము తప్పియున్నవి నా హృదయము నా అంతరంగమందు మైనమువలె కరగియున్నది.
మనలో
ఉన్న అవినీతి ఆక్రమము పాపము, చేదు జీవితం, వ్యభిచారం లాంటి చెడుగు
కడిగి పరిశుద్ధ పరచి మనలను జీవపు వాసనగా మార్చి యున్నాడు దేవుడు! అందుకే ఆయన పరిమళ తైలము గా ఉన్నారు మనకు !
2 కోరింథీ 2 చూసుకుంటే
15 రక్షింపబడువారి పట్లను నశించువారి పట్లను మేము దేవునికి
క్రీస్తు సువాసనయై యున్నాము.
16 నశించువారికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షింప బడువారికి
జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము.
కాబట్టి
మన పాపపు దుర్వాసన తొలిగించి క్రీస్తు సువాసనతో దేవుడు మనలను నింపారు! అదే సువాసనను మనము మన
పొరుగువారికి బందుమిత్రులకు నింప వలసిన అవసరం ఎంతైనా ఉంది!
ఎఫెసీ 5: 2 క్రీస్తు మిమ్మును ప్రేమించి,
పరిమళ వాసనగా ఉండుటకు మనకొరకు తన్నుతాను దేవునికి అర్పణముగాను బలిగాను
అప్పగించుకొనెను; ఆలాగుననే మీరును ప్రేమగలిగి నడుచుకొనుడి.
3 మీలో జారత్వమే గాని, యే విధమైన
అపవిత్రతయే గాని, లోభత్వమేగాని, వీటి పేరైనను
ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది.
4 కృతజ్ఞతావచనమే మీరుచ్చరింపవలెను గాని మీరు బూతులైనను,
పోకిరిమాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు;
ఇవి మీకు తగవు.
ఇక ఇదే పరిమళ తైలము సహోదరులు మధ్య ఐక్యతను తీసుకుని వచ్చి తద్వారా అభిషేకమును
ఆశీర్వాదమును తీసుకుని వచ్చినట్లు మనము కీర్తనల గ్రంధము 133 లో చూడగలము!
కాబట్టి సహోదరులమైన మనమంతా ఐక్యతతో ఉండాలి! నిజమైన
సహోదరుల మద్య ఐక్యత ఉండాలి! మన సంఘాలలో విశ్వాసుల మధ్య మరియు
సంఘముల మధ్య సంఘ కాపరుల మధ్య ఐక్యత వర్ధిల్లాలి! అప్పుడే ఆశీర్వాదము
అభిషేకము కలుగుతుంది మనకు! అప్పుడు ఆహారోను తలమీదుగా ఆ అభిషేకము
– యేసుక్రీస్తు ప్రభులవారి
నుండి మనమీదకు కారుతుంది! అప్పుడు మన గిన్నె నిండి పొరలి పారుతుంది!
ఇలా ఐక్యతతో ఉన్నప్పుడే ఏసునామము పరిమళ తైలముగాను పరిమళ వాసనగాను ఉంటుంది!
మనలో మనకు సమాధానం ఐక్యత లేకపోతే మన నుండి దుర్వాసన వ్యాపించి క్రీస్తు
నామము అవమాన పరచబడుతుంది!
అలాగే ''నీ పేరు పోయబడిన పరిమళతైలముతో సమానము.'' ఎంత వివరముగా ఈ వచనములో అలంకార ప్రాయముగా
వర్ణించబడింది. నీ పేరు
అనగా ప్రియుని పేరు. ఇంతవరకు యేసుక్రీస్తు ప్రభువును ప్రియునిగా వర్ణించారు. ఈ వచనములో నీ పేరు అంటే యేసుక్రీస్తు
పేరే. యేసుక్రీస్తు పేరు
పోయబడిన పరిమళతైలముతో సమానమని చెప్పబడింది. ఎలా? ఈ పోయబడిన పరిమళతైలమును ప్రతిష్ఠాభిషేక
తైలముగా పాతనిబంధనలో పిలువబడింది. అలాగే ఈ లోకములో జన్మించిన దైవకుమారుని పేరు ఏమిటి? క్రీస్తు లేక యేసు. యేసు అనగా రక్షకుడు క్రీస్తు అనగా అభిషిక్తుడు.
లూకా
2:11, ''దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు,
ఈయన ప్రభువైన క్రీస్తు.''
యోహాను 1:42, ''యేసునొద్దకు అతని తోడుకొని
వచ్చెను. మెస్సీయ అను
మాటకు అభిషిక్తుడని అర్థము.'' ఇది
అందరికి తెలిసినదే. ఈ
విధముగా ప్రియుని పేరు పోయబడిన పరిమళతైలముతో సమానమైనది.
ఇలాంటి
అభిషిక్తుడైన యేసును అనగా క్రీస్తు ప్రభువును కన్యకలు నిన్ను ప్రేమించుదురు అని చెప్పబడింది. కన్యకలు ఎవరు? అంటే పరిశుద్ధులమైన మనమే. ఎవరైతే దేవునిలో పరిశుద్ధులుగా జీవిస్తారో
వారు కన్యకలు. వారు మగవారు
కావచ్చు లేక ఆడవారు కావచ్చు. వారిలో పెండ్లి అయినవారు కావచ్చు లేక పెండ్లి కానివారు కావచ్చు లేక పసిపిల్లలలో
బాలికలు కావచ్చు లేక బాలురు కావచ్చు.
వీరిలో ఎవరైన రక్షకుని యందు విశ్వాసముంచిన వారు అనగా ఆడ మగ అను
తేడా లేకుండ దేవుని పిల్లలుగా లెక్కింపబడుదురు. యోహాను 1:12, ''తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు
విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.'' వీరంతా యుగాంతములో గొఱ్ఱెపిల్లయైన
క్రీస్తు అను ప్రియునికి వధువుగా మారుదురు. చివరకు వివాహానంతరము భార్యగా మారుదురు
కనుక ఈ లోకరీత్యా వీరు పవిత్ర స్థితిలో ఏ దశలో వారి జీవితము ఉన్నను వారందరు కన్యకలే. కనుక ఈ కన్యకలమైన మనమందరము ఆయనను
ప్రేమించుదుమని వ్రాయబడింది. వీరు ప్రేమ ఎంతవరకు చూపుచున్నారో ఒక్కసారి తెలుసుకోవలసిన అవసరత ఉన్నది. కన్యకలుగా పిలువబడిన అపొస్తలులు ప్రపంచ
నలుమూలల క్రీస్తును గూర్చి ప్రచారము చేసారు. క్రీస్తు ప్రేమకు దూరమై జీవిస్తున్న
కన్యకలను మీరు చెడిన స్థితిలో ఉన్నారు.
నిజానికి మన ప్రియుడు రక్షకుడు క్రీస్తు ప్రభువేనని వీరు సువార్త
ప్రచారము చేసారు. దైవవ్యతిరేకులచే
చంపబడినారు. అలాగే హతసాక్షులు
ఆయనను అనగా తమ ప్రియుని గూర్చి తాము ఇచ్చు సాక్ష్యమును గూర్చి తమను చంపుచున్నను ఎలాంటి
సంకోచము చూపకుండ వారు తమరీ ప్రేమను వెల్లడి చేసారు. అలాగే విశ్వాసులు హతసాక్షులయొక్క
మరణమును చూస్తూ కూడ విశ్వాసములో చెదరక అలాగే ఉన్నారంటే వారి ప్రేమ అలాంటిది. ఇంతకి ఒక్క విషయము గమనించారా! మనకు ఏ పని పాట లేదనా మనము ఆదివారము
ఆరాధనకు ఖచ్చితముగా వెళతాము? క్రీస్తు ప్రభువుపై ఉన్న ప్రేమతోనే కదా! ఎన్ని పనులున్నను అవన్ని ప్రక్కన
పెట్టో లేక ముందుగా కష్టించి పని చేసేసి సమయానికి ప్రియుని సన్నిధికి వెళ్లుట లేదా! ఈ విధముగా కన్యకలుగా మనము ఆయనను ప్రేమించుచున్నాము.
మరి కన్యకలకు మనలను ఎందుకు
పోల్చబడింది? అని ఆలోచిస్తే
కన్యక అని ఎవని గూర్చి అంటారు? పురుషునితో సంబంధము లేని స్త్రీని
కన్యక అని అంటారు. అంటే
ఈ కన్యక అంటే ఏ దోషము లేని స్త్రీ అని బైబిలు గ్రంథము చెప్పుచున్నది. ఎవరిలో అయితే 10 ఆజ్ఞలకు వ్యతిరేక జీవితము ఉండదో వారందరు పాపము లేని కన్యలు. ఇలాంటి కన్యకలు క్రీస్తు ప్రభువును
ప్రేమిస్తారు. పాపపు
జీవితములో జీవించువారు అనగా ప్రకటన 21:8, ''పిరికివారును,
అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రికులును,
విగ్రహారాధకులును, అబద్ధికు లందరును అగ్ని గంధకములతో
మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.'' ఇలా చెప్పబడినవారు మలినముతో నిండిన
కన్యకలు వీరిని ఆత్మ రీత్యా వ్యభిచారులు అని యిర్మీయా ప్రవచించియున్నారు. ఎవరైతే దేవునిలో జీవించుచు ఆయనయందు
మనస్సు కలిగి ఉందురో వారు కన్యకలు గనుక ఆయనను తమ ప్రియునిగా ఆరాధించుట అనగా ప్రేమించుట
జరుగును. మత్తయి 25:10.
అట్టి
కృప ఆరాదన చేసే ధన్యత, యేసుక్రీస్తుప్రభులవారి ని ప్రేమించే భాగ్యము దేవుడు మనకు దయచేయును గాక!
ఆమెన్!
*గీతాలకు గీతము-పరమగీతము*
*7వ భాగము*
*నన్ను ఆకర్షించుము మేము నీయొద్దకు పరుగెత్తి వచ్చెదము*
పరమగీతము 1:4
4. నన్ను ఆకర్షించుము మేము నీయొద్దకు పరుగెత్తి వచ్చెదము
రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనెను నిన్నుబట్టి మేము సంతోషించి ఉత్సహించెదము
ద్రాక్షారసముకన్న నీ ప్రేమను ఎక్కువగా స్మరించెదము యథార్థమైన మనస్సుతో వారు నిన్ను
ప్రేమించుచున్నారు.
ప్రియులారా! ఇక 4వ
వచనం చూసుకుంటే నన్ను ఆకర్షించుము మేము నీయొద్దకు పరుగెత్తి వచ్చెదము
అంటున్నారు. గమనించాలి- నన్ను ఆకర్శిస్తే
మేము నీయొద్దకు పరుగెత్తి వస్తాము – షూలమ్మితి అంటుంది అయ్యా
నన్ను నీవు ఆకర్శిస్తే మేము అనగా మొత్తము నా జనమంతా నీ దగ్గరకు పరుగెత్తి వస్తాము అంటుంది.
దీని అర్ధము మామూలుగా చూసుకుంటే ఆత్మీయ కోణంలో పరలోక రాజు తానే వచ్చి
మనలను తనతో ఏకాంత సహవాసానికి ఆకర్షించకపోతే మనం ఎన్నటికీ అందులోకి చేరము (యోహాను 6:44, ). ఆ పనంతా ఆయనదే. అయితే ఆయనతో ప్రేమ పూర్వకమైన సహవాసాన్ని ఆతురతగా, ఇష్టపూర్వకంగా
కోరుకునే మనస్సు మనకు ఉండాలి. “నన్ను...మనం”– ఈ గీతంలో కొన్ని సార్లు విశ్వాసులందరూ ఒకటిగా – ఒక వధువుగానూ,
మరి కొన్ని సార్లు ఒక వ్యక్తుల సమూహంగానూ కనిపిస్తారు. కీర్తనల గ్రంథము 45:14-15, ; ప్రకటన గ్రంథం
19:7-8, పోల్చిచూడండి. “నిన్ను ప్రేమించడం”– పరలోక రాజును ప్రేమించడం
కంటే విశ్వాసులకు తగిన విషయం మరొకటి లేదు.
సరే- అబ్రాహాము గారు పిలువబడిన కోణంలో
చూసుకుంటే మేము అనగా ఇశ్రాయేలు జాతి నన్ను అనగా అబ్రాహాము గారి సంతానంలో రక్షించబడిన
విశ్వాసి! మరి ఇశ్రాయేలు జాతి దేవునితో అంటున్నారు అయ్యా మమ్మల్ని
ఆకర్శించండి మేమంతా నీ వద్దకు పరుగెత్తుకుని వస్తాము అంటున్నారు! మరి ఈ ప్రవచనం ఎప్పుడు నెరవేరుతుంది? ఎందుకంటే ఇంతకు
ముందు ఇది నెరవేరలేదు ఇంతవరకు నెరవేరలేదు! ఎప్పుడు నెరవేరుతుంది
అంటే అన్యజనులలో రక్షించబడవలసిన చివరి వ్యక్తి రక్షించబడిన వెంటనే సంఘము ఎత్తబడిన తర్వాత
ఇశ్రాయేలు ప్రజల రక్షణ కార్యము ప్రారంభమవుతుంది. అప్పుడు దేవుడు
వారిని ఆకర్షిస్తారు. అప్పుడు దేవుడు ఇశ్రాయేలు సమకూరుస్తారు! కూర్చబడిన తర్వాత కూడా మొదట వారు క్రీస్తు విరోధి వైపు ఆకర్షించబడినా వాడు
బలి అర్పణ నిలిపివేసిన తర్వాత ఇశ్రాయేలు ప్రజల కన్నులు తెరువబడి ఏసుక్రీస్తు ప్రభులవారి
వైపుకి తిరుగుతారు! ఈ విధంగా మహా శ్రమల కాలంలో ఇశ్రాయేలు ప్రజలంతా
క్రీస్తువైపుకి ఆకర్షించ బడతారు! అప్పుడు రోమా పత్రిక ప్రకారం
ఇశ్రాయేలు ప్రజలు మొత్తం రక్షించబడతారు! చివరికి వేఏండ్ల పాలన
నాటికి ఇశ్రాయేలు ప్రజ మొత్తం ప్రభువు వద్దకు ఆకర్షించ బడతారు!
ఇక సంఘకోణంలో చూసుకుంటే ''నన్ను ఆకర్షించుము,'' అని అనుటలో ఎవరిని ఎవరు ఆకర్షించాలి? ప్రియురాలు ప్రియునితో నన్ను ఆకర్షించుము
అని చెప్పుట జరిగింది. అంటే క్రీస్తు ప్రభువు పురుషునిగా సంఘము ప్రియురాలుగా మనము చెప్పుకొన్నాము. క్రీస్తు ప్రభువు సంఘమును ఏ విధముగా
ఆకర్షిస్తాడో తెలుసుకొందము.
ప్రకటన
22:17, ''ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు;
వినువాడును రమ్ము అని చెప్పవలెను; దప్పిగొనిన వానిని
రానిమ్ము; ఇచ్ఛయించువానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము.''
ఇందులో ఆత్మ, పెండ్లి కుమార్తె అయిన ప్రియురాలు, విశ్వసించిన విశ్వాసి
అనగా కన్యక అందరు రమ్ము అని పిలుస్తున్నారు. ఎవరిని? ఎవరిలో నైతే క్రీస్తు ప్రభువునందు
విశ్వాసము లేక జీవిస్తున్నారో వారిని పిలుస్తున్నారు. ఆత్మయైన దేవుడు జీవాత్మను పిలుస్తున్నాడు. సంఘము తనలో అప్పటిదాక చేరిన కన్యల
క్రియలన్నిటిని ఐక్య రీతిన చూపుచు పిలుస్తున్నది. విడివిడిగా సంఘముగా కాకుండ కూడ జీవాత్మయైన
నరుడు అనగా విశ్వాసి అనగా కన్య పిలుస్తుంది. ఈ కన్య అనగా ప్రియురాలు ఎవరిని ఆకర్షించమని
కోరుకొంటున్నది? క్రీస్తు
ప్రభువునే కదా! అందుకే
క్రీస్తు ప్రభువు - సిలువపై నుండి ఆకర్షిస్తేనే గాని ఎవరును ఆయన
యొద్దకు రాలేరని చెప్పుచున్నారు. యోహాను 12:32, ''నేను భూమిమీదనుండి పైకెత్తబడినయెడల అందరిని నాయొద్దకు ఆకర్షించుకొందునని చెప్పెను.''
అంటే సిలువపై వ్రేలాడుచు రక్తసిక్తమై
మరి కొద్ది క్షణములలో మరణించబోవు స్థితిలో ఉన్న క్రీస్తు ప్రభువును ప్రియురాలు అనగా
సంఘము తనను ఆకర్షించమని కోరుకొంటుంది.
అంటే రక్షణ ఒక సిలువ బలిలోనే ఉన్నది. ఈ బలిని అర్పించి క్రీస్తు ప్రభువు
ఆకర్షించుట జరిగితే, రక్షణలోనికి రాగలుగుదురు. అందుకే నేను ఇన్ని ఆత్మలను రక్షించాను
అని విర్రవీగుట విశ్వాసికి తగదు.
ఎప్పుడైతే
సిలువపై యున్న క్రీస్తు ప్రభువు ఆకర్షించాడో ప్రియురాలైన కన్యకలు ఆకర్షించబడి మేము
నీయొద్దకు పరుగెత్తి వచ్చెదము అని చెప్పుచున్నది. నన్ను ఆకర్షించమని సంఘము అను కన్యక
అడిగినందున, తరువాత ప్రియురాలుగా ఆకర్షించబడిన కన్యక లందరు కలిసి
నీయొద్దకు పరుగెత్తి వచ్చెదమని చెప్పుట జరిగింది. ఎఫెసీ
2:19. ఎక్కడికి వస్తారు? మొదటగా రక్షణలోకి, తరువాత ప్రియురాలుగా ఏక సంఘములోనికి, తరువాత క్రీస్తుతో
పాటుగా పరలోకమునకు వెళ్లుటకు పరుగెత్తి వస్తారు. వచ్చేవారు నెమ్మదిగా రావటము లేదు. ఆయన ఆకర్షణ అలాంటిది. ఒక్కసారి ఆకర్షింపబడితే ఇక క్షణమైన
ఆగలేరు. వారి మనస్సు
రక్షణ పొందాలన్న తపనతో పరుగులు తీస్తుంది.
కనుక ఆకర్షించబడిన కన్యకలు ప్రియురాలుగా మారుటకు పరుగెత్తుకొని
వచ్చుట జరుగును.
ఇలా పరుగెత్తుకొని
వచ్చినవారిని రాజు తన అంత:పురములోనికి నన్ను చేర్చుకొనెను అని
చెప్పుచున్నది. అంతేకాకుండా పెండ్లి కుమార్తె గదిలోనుండియు పెండ్లి
కుమారుడు అంతఃపురములోనుండి వచ్చును అని వ్రాయబడింది. యోవేలు
2:16;
ఇక ఇందులో
చెప్పబడిన రాజు / పెండ్లి కుమారుడు ఎవరు? సంఘముయొక్క ప్రియుడైన క్రీస్తు ప్రభువే. ఎలా? లూకా 23:3, ''పిలాతు -నీవు యూదుల రాజువా అని ఆయనను అడుగగా ఆయన-నీవన్నట్టే అని అతనితో చెప్పెను.'' నీవు యూదుల రాజువా? అంటే నీవన్నట్టే అని క్రీస్తు ప్రభువే
స్వయముగా చెప్పుట జరిగింది. ఈ రాజు దావీదు సింహాసనమును యుగయుగములు ఏలునని చెప్పబడింది. లూకా 1:32, ''ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడన బడును; ప్రభువైన
దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును.'' తూర్పు దిక్కునుండి వచ్చిన జ్ఞానులు
కూడ హేరోదును క్రీస్తు ప్రభువును గూర్చి విచారిస్తూ యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ అని
మత్తయి 2:1-5లో చెప్పబడింది. కనుక పరమగీతములో చెప్పబడిన రాజు క్రీస్తు
ప్రభువు.
ఇలాంటి
రాజు ఎప్పుడైతే తనను ఆకర్షించాడో ఎప్పుడైతే ఆ ఆకర్షణకు ఆకర్షించబడి కన్యలందరు పరుగెత్తుకొని
వచ్చారో వారందరు ఒకే క్రీస్తుయేసు సంఘమైనందుకే ''నన్ను''
అన్న ఏకవచనం ఇందులో చెప్పబడింది. యెరూషలేమను సంఘమును తన అంత:పురములోనికి చేర్చుకొంటాడు.
ఈ అంత:పురము పరలోక రాజ్యమే. ఈ రాజ్యములో అనేక గృహములు ఉన్నట్లుగా
క్రీస్తు ప్రభువు తెలియజేశాడు. యోహాను 14:2-6, ''నా తండ్రి యింట అనేక నివాసములు కలవు, లేనియెడల మీతో చెప్పుదును;
మీకు స్థలము సిద్ధపరచ వెళ్లుచున్నాను. నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచ
వెళ్లుచున్నాను. నేను
వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద
నుండుటకు మిమ్మును తీసికొని పోవుదును.
నేను వెళ్లుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియునని చెప్పెను. అందుకు తోమా-ప్రభువా, యెక్కడికి వెళ్లుచున్నావో మాకు తెలియదే;
ఆ మార్గమేలాగు తెలియునని ఆయన నడుగగా యేసు-నేనే
మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు.'' కనుక పరలోక రాజ్యములో జీవాత్మకు సంబంధించిన
నివాసములు ఉన్నాయి. అవి
రాజైన క్రీస్తు ప్రభువునకు సంబంధించినవి గనుక ఆయన తన ప్రియురాలుగా వచ్చుచున్న జీవాత్మలమైన
మనకు వీటిని సిద్ధపరచి మనలను తనతో తీసుకొని పోవును. ఇక్కడ తన ప్రేమ ఎంత గొప్పదో చూడండి. క్రీస్తు ప్రభువే మన కొరకు మనముండవలసిన
నివాసములను సిద్ధపరచును. ఈ విధముగా ప్రియుడు ఆకర్షించగా పరుగెత్తుకొచ్చిన ప్రియురాలిని పరలోకములో తన
అంత:పురములలో చేర్చుకొని బహు ఆదరణతో చూచుకొనును.
ప్రియమైన
సహోదరీ / సహోదరుడా! ఆయన నిన్నుకూడా ఆకర్షిస్తున్నారు. మరినీవు నీవు ఆకర్షించబడుతున్నావా? ఇంతకీ నిన్ను ఏది
ఆకర్షిస్తుంది? వరుడైన యేసుక్రీస్తుప్రభులవారా లేక లోకమా?
సరిచూసుకో!
సరిచేసుకో!
దైవాశీస్సులు!!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*8వ భాగము*
*నేను నల్లనిదాననైనను సౌందర్యవంతురాలను *
పరమగీతము 1:5
5. యెరూషలేము
కుమార్తెలారా, నేను నల్లనిదాననైనను సౌందర్యవంతురాలను కేదారువారి
గుడారములవలెను సొలొమోను నగరు తెరలవలెను నేను సౌందర్యవంతురాలను
6. నల్లనిదాననని నన్ను చిన్న చూపులు చూడకుడి.
నేను ఎండ తగిలినదానను నా సహోదరులు నామీద కోపించి నన్ను ద్రాక్షతోటకు
కావలికత్తెగా నుంచిరి అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని.
ప్రియులారా! ఇక 5వ
వచనం చూసుకుంటే యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లనిదాననైనను సౌందర్యవంతురాలను కేదారువారి గుడారములవలెను సొలొమోను నగరు
తెరలవలెను నేను సౌందర్యవంతురాలను అని షూలమ్మితి అంటుంది.
అయితే
ప్రియులారా! ఈ వచనం ధ్యానం చేసేముందుగా షూలమ్మితి నల్లగా
మారిపోడానికి కారణం ఏమిటి? యెరూషలేము కుమార్తెలు
ఎవరో అనేది చూసుకుని ఈ వచనం ధ్యానం చేసుకుందాం!
మొదటగా నల్లనిదిగా ఎందుకు మార్చబడింది? కారణం ఆమె మొదట సౌందర్యవంతురాలే
గాని ఇప్పుడు ఎండతగిలి నలుపుగా మారిపోయింది! ఆరవ వచనంలో దానికి
జవాబు చెబుతుంది షూలమ్మితి! నా సహోదరులు నామీద కోపగించి నన్ను
ద్రాక్షతోటకు కావలిదానిగా చేసేశారు అంటున్నది! దీనికి కారణం తెలియాలి
అంటే మొదట భాగంలో చెప్పుకున్న జరిగిన కధ మరలా చెప్పుకోవాలి!
రాజైన సోలోమోను తాను ఇంకా
యవ్వనస్తునిగా ఉన్నప్పుడు రాజ్యమంతా పర్యటించేటప్పుడు షూనేము ప్రాంతానికి వస్తాడు. అక్కడ ఒక యవ్వనురాలను చూసి ప్రేమిస్తాడు. అయితే తాను రాజకుమారుడు అని తెలిస్తే భయపడి తనను ఎక్కడ తిరస్కరిస్తుందోనని
భావించి ఒక గొల్ల పిల్లవానిలా వేషం వేసుకుని ఆమెకు దగ్గరవుతాడు. ఈలోగా ఆమె యొక్క అన్నలు (సవితి అన్నలు అనగా ఆ అన్నలు
యొక్క తల్లి చనిపోయిన తర్వాత షూలమ్మితి తల్లిని పెళ్లి చేసుకుంటాడు తండ్రి)
ఆమెకు ఒక వ్యక్తితో ప్రధానం చేస్తారు! గాని షూలమ్మితి
ఈ గొల్లపిల్లవాని వేషంలో ఉన్న సోలోమోనును ప్రేమిస్తుంది గనుక అన్నలు కోపపడి వారియొక్క
ద్రాక్షతోటకు కాపలాదారిగా నియమిస్తారు.
దానితోపాటు చిన్న మందను కూడా కాపాలాకాయమని అప్పగిస్తారు!
గాని ఆమె సొంత తోటను, సొంత మందను పట్టించుకోకుండా
సొలోమోను చుట్టూ తిరుగుతుంది. అప్పుడు సోలోమోను తాను ఎవరో చెబుతాడు.
ఈ విషయం తెలిసిన అన్నలు ఆమెను సోలోమోను పొలములో పనికత్తెగా నియమిస్తారు.
అప్పుడు ఆమె షూనేము నుండి యెరూషలేము వచ్చి సోలోమోను పొలములో ఒక దాసీగా
పనిచేస్తుంది. అదికూడా ఎండలో పనిచేస్తుంది. అప్పుడు ఆమె సౌందర్యము దెబ్బతింటుంది నల్లగా మారిపోతుంది శరీరం! అయినా సోలోమోను ఆమెనే ప్రేమించి పెళ్లిచేసుకుంటాడు! ఇది
జరిగిన సంఘటన! అందుకే నల్లగా మారిపోయింది!
సరే- ఇక యెరూషలేము కుమార్తెలు ఎవరు? దీనికోసం
చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయి గాని నేను నమ్మేది వాక్యాధారంగా చెబుతాను!
సంఘకోణంలో నా అభిప్రాయం వీరు నామకార్ధ క్రైస్తవులు! పైకి క్రైస్తవులుగా
నటిస్తారు గాని నిజానికి క్రైస్తవులు విశ్వాసులు కారు! బొట్టు
మాత్రమే పెట్టుకోరు గాని అన్నీ అన్యులు చేసేపనులే చేస్తారు! బైబిల్
చెప్పినట్లు పైకి భక్తిగలవానీలా కనిపిస్తూ దాని శక్తిని ఆశ్రయించని వారు! మందిరానికి వస్తారు గాని ఇంటివద్ద అన్నీ అన్యాచారాలే! ఇదే గ్రంధంలో 7 రకాలైన యెరూషలేము కుమార్తెలు కనిపిస్తున్నారు
లేక వీరి యొక్క 7 గుణాలు ఈ గ్రంధంలో మనకు కనిపిస్తున్నాయి!
వీరు నేటి రోజులలో మనమధ్య కూడా ఉన్నారు! వీరి విషయంలో
మనం జాగ్రత్త కలిగి నడుచుకోవాలి లేకపోతే మనలను కూడా బ్రష్తులుగా చేసేయగలరు వీరు!
మొదటగా ఇదే వచనం ప్రకారం వీరు- ఇతర విశ్వాసులను చాలా చులకనగా చూస్తారు!
ఈ వచనంలో ఈ యెరూషలేము కుమార్తెలు షూలమ్మితిని చులకనగా తక్కువగా చూస్తున్నారు
ఎందుకంటే ఆమె నల్లగా ఉంది! విశ్వాసి జీవితంలో ఎవరికైనా మాటిమాటికి
శ్రమలు వచ్చినా శోధనలు వచ్చినా వీరు వాళ్ళను చులకనగా చూస్తారు- వీరేదో మహా భక్తిపరులు అని- వారేదో ఘోరమైన పాపము చేశారు
అందుకే దేవుడు వారిని శిక్షిస్తున్నట్లు మాట్లాడుతూ ఉంటారు యోబుగారి స్నేహితుల వలె!
గాని నిజానికి వారు పరలోకమునకు పోయే బాచ్ కాబట్టి చిన్న తప్పుచేసినా
దేవుడు లెంపకాయ కొట్టి తిరిగి తన దారిలోనికి తెచ్చుకుంటున్నారు అని వీరికి తెలియదు!
సంఘాలలో ఇప్పటికీ అనేకమందికి కులగజ్జి ఉంది, మరికొందరికి
డబ్బులున్న వారంటే మోజు- పేదవారంటే చిన్నచూపు! ఇలాంటి బేధాలు ఎంచేవారు ఈ మొదటి రకమైన యెరూషలేము కుమార్తెలు!
రెండవ వర్గము: 2:7 ప్రకారం ఇతర విశ్వాసులను కలతపరచి సంఘమునుండి చెదర
గొడతారు! ప్రేమకు ఇష్టమగువరకు మీరు లేపకయు కలతపరచకయు నుండుడని
మిమ్మును బతిమాలుకొనుచున్నాను అంటుంది షూలమ్మితి! వీరు దేవునితో
గడపరు- గడిపే వారిని హేళన చేస్తారు- కలవర
పెడతారు! వీరు ప్రార్ధన చేయరు- చేసేవారిని
వెక్కిరిస్తారు! వీరు పరిచర్య చేయరు చేసేవారికి పేర్లు పెడతారు!
ఈ రకమైన వారు! ముక్యంగా ఎవరైతే దేవునిలో ప్రార్ధనలో
ఎక్కువగా సాగుతారో వారినే విమర్శిస్తూ ఉంటారు వీరు! తాచెడ్డ కోతి
వనమంతా చెరిపినట్లు! కూసే గాడిద మేసే గాడిదను చెడగొట్టినట్లు
వీరు చెడగొడుతూ ఉంటారు! ఒకవేళ ప్రియ చదువరీ! ఈ గుంపులో నీఉంటే నీవు చాలా దుష్టత్వములో
ఉన్నావని దేవుని తీర్పుకు పాలవుతావని మరచిపోవద్దు!
మూడవది: 3:4,5 వచనాలు ప్రకారం-ఒక విశ్వాసి
దేవుణ్ణి తెలిసికొని ప్రభువుతో ఎక్కువ సమయం గడుపుతూ ఉంటే వారిని ఆటంకపరిచే వారు!
ఈ రక్షించబడిన వారికి దేవునితో ఎక్కువగా గడపాలని వాక్యపఠనంలో ప్రార్ధనలో
పరిచర్యలో సాగాలని పరుగులు పెడుతూ ఉంటే వీరు వారి విశ్వాసాన్ని చల్లార్చుతూ లోకము వైపుకు
నడిపించే వారు! వారు చెడిపోయారు- కొత్తగా రక్షించబడిన
వారిని సహితం చెరిపేస్తూ
వుంటారు!
నాలుగు:
3:9,10 వచనాలా ప్రకారం వీరు కూడా అప్పుడప్పుడు దేవుని పని చేస్తారు-
గాని పేరు కోసం ఘనత కోసం చేస్తారు గాని నిజానికి దేవుని మహిమార్ధమై చేయరు!
అక్కడ వారు సోలోమోను రాజు యొక్క మంచమును అలంకరించారు! గాని తర్వాత ప్రభుని ప్రేమించలేదు! కాబట్టి అననీయ సప్పీరాల
వలె గొప్పలు కావాలి వారికి! పేరు ప్రతిష్టలు కావాలి- సంఘ కమిటీలో విశిష్టమైన స్థానం కావాలి గాని వీరుగాని వీరి కుటుంబం గాని దేవునికి
దూరంగా ఉంటారు!
ఐదవది: 5:8—9 ప్రకారం-
షూలమ్మితి దేవునికి దూరమైంది- తన తప్పును తెలుసుకుని
మరలా ప్రభుని కలుసుకోవాలని అనుకుంటుంది.
అయితే ఇప్పుడు ప్రాణప్రియుడైన యేసయ్యను వెదుకుతా ఉంటే ఓస్ నీ
ప్రియుడేనా ప్రియుడు- మా ప్రియులు మాకు గొప్పకాదా అంటూ ప్రభువుని
ప్రేమించక చులకనగా మాట్లాడతారు! షూలమ్మితికి ఉన్న ప్రభుప్రేమ
వీరికి కొంచెమైనా లేదు! మేము భక్తి చేయడం లేదా? మేము ప్రార్ధన చేయడం లేదా? అస్తమాను కూటాలేనా అస్తమాను
ప్రార్ధనలేనా అంటూ మాట్లాడుతో ఉంటారు! వెళ్ళేవారిని నిరుత్సాహ
పరుస్తూ ఉంటారు ఈ యెరూషలేము కుమార్తెలు!!!
ఆరు: 5:16 ప్రకారం షూలమ్మితి ప్రభువుని పొగుడుతూ ఉంటే ఓహో అలాగా
అన్నారు గాని ఆ రాజుని ప్రియున్ని ఆరాధన చేసినవారు కాదు! అనగా
వీరు హృదయ పూర్వకంగా ప్రభువుని ఆరాధించే వారు కాదు గాని పెదాలతో దేవుణ్ణి స్తుతించే
వారు అని అర్ధమవుతుంది!
ఏడు:
8:4 ప్రకారం ఇక్కడ షూలమ్మితి తండ్రియొక్క ఒడిలో సేద దీరుతూ ఉంది అలాంటి
షూలమ్మితిని వీరు లేపుతూ కలత పెడుతున్నారు! అనగా ఎన్ని శ్రమలు
వచ్చినా ఎన్ని హింసలు వచ్చినా ప్రభువుకోసమే నిలబడే స్థిర విశ్వాసులను కలవర పెట్టేవారు-
అలాంటివారిని వారి అవిశ్వాస పూర్వకమైన సలహాలతో దేవుని మీద వారు పెట్టుకున్న
స్థిర విశ్వాసము నిరీక్షణ నుండి తొలగించడానికి ప్రయత్నం చేసేవారు ఈ చివరి రకమైన యెరూషలేము
కుమార్తెలు!
ప్రియమైన దేవుని బిడ్డా!
ఈ ఏడు గుంపులలో నీవున్నావేమో ఒకవేళ సరిచూసుకో! నీవు గాని ఈ గుంపులలో ఏ గుంపులో ఉన్నా నీవు దేవునికి దూరమైపోతున్నావని ఇంకా
దేవుని ఉగ్రతకు త్వరలో పాత్రుడుగా ఉండబోతున్నావని గ్రహించి సరిచేసుకుని దేవునికి ఇష్టమైన
వానిగా మారిపొమ్మని ప్రభువు పేరిట మనవి చేస్తున్నాను!
దైవాశీస్సులు!!!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*9వ భాగము*
*నేను నల్లనిదాననైనను సౌందర్యవంతురాలను*
పరమగీతము 1:5
5. యెరూషలేము
కుమార్తెలారా, నేను నల్లనిదాననైనను సౌందర్యవంతురాలను కేదారువారి
గుడారములవలెను సొలొమోను నగరు తెరలవలెను నేను సౌందర్యవంతురాలను
6. నల్లనిదాననని నన్ను చిన్న చూపులు చూడకుడి.
నేను ఎండ తగిలినదానను నా సహోదరులు నామీద కోపించి నన్ను ద్రాక్షతోటకు
కావలికత్తెగా నుంచిరి అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని.
ప్రియులారా! ఇక 5వ
వచనం చూసుకుంటే యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లనిదాననైనను సౌందర్యవంతురాలను కేదారువారి గుడారములవలెను సొలొమోను నగరు
తెరలవలెను నేను సౌందర్యవంతురాలను అని షూలమ్మితి అంటుంది.
అయితే
ప్రియులారా! గతభాగమ్లో షూలమ్మితి నల్లగా మారిపోడానికి కారణం ఏమిటి? యెరూషలేము కుమార్తెలు
ఎవరో అనేది ధ్యానం చేసుకున్నాము!
ఇక
ఈ వచనాన్ని ధ్యానం చేసుకుందాము!
యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లనిదాననైనను సౌందర్యవంతురాలను కేదారువారి
గుడారములవలెను సొలొమోను నగరు తెరలవలెను నేను సౌందర్యవంతురాలను అంటుంది షూలమ్మితి!
నిజానికి జెరుసలం కుమార్తెలంటే అప్పట్లో
వ3లో కనిపించే “కన్యలు”,
వ 4లో మాట్లాడిన “చెలికత్తెలు”
కావచ్చు. ఇందులో మనమేమీ ఖచ్చితంగా చెప్పలేము.
“నలుపు”– ఆదికాండము 25:12-13, లో కేదారు ప్రసక్తి ఉంది. వారు గుడారాలను నల్ల మేకల బొచ్చుతో
నేసేవారు. విశ్వాసులు పాపాత్ములే గాని పవిత్రులు కూడా.
దేవుడు మనిషిని తన పోలికలో చేశాడు (ఆదికాండము
1:26, ). అందువల్ల ఆరంభంలో వారిలో ఆధ్యాత్మిక సౌందర్యం ఉంది.
అయితే తాము పాపంవల్ల చెడిపోయామనీ తమకిప్పుడున్న ఆధ్యాత్మిక సౌందర్యం
క్రీస్తుతో తమ సంగమం వల్లే అనీ విశ్వాసులకు తెలుసు. వారి సౌందర్యమంతా
దేవుడు ఉచితంగా ఇచ్చినదే (యెషయా 61:10, ; 1 దినవృత్తాంతములు 1:30, ; 2 దినవృత్తాంతములు
5:21, ; ఎఫెసీయులకు 4:22-24, ). ఇక్కడ వధువు అంటున్న
మాటల్లో కొద్దిగా ఆందోళన ఉన్నట్టుగా కనిపిస్తుందా? పరిపూర్ణమైన
ప్రేమ భయాన్ని పారద్రోలుతుంది అని తరువాత ఆమెకు తెలిసివస్తుంది (1 యోహాను 4:18, ).
గతభాగంలో నిజానికి షూలమ్మితికి నల్లని రంగు ఎందుకు వచ్చింది
అనేది చూసుకున్నాము! ఇక సంఘానికి నల్లని రంగు ఎందుకు వచ్చింది అనేది సంఘకోణంలో
చూసుకుందాము! ఇంతకి నల్లనిదనము ఎందుకు వచ్చింది? పాపము మనిషిలో మురికిగా దేవునికి
కనిపిస్తుంది. అందుకే
ప్రకటన 7:13-14, ''పెద్దలలో ఒడు-తెల్లని
వస్త్రములు ధరించుకొనియున్న వీరెవరు?
ఎక్కడనుండి వచ్చిరని నన్ను అడిగెను. అందుకు నేను-అయ్యా, నీకే తెలియుననగా అతడు ఈలాగు నాతో చెప్పెను-వీరు మహా శ్రమలనుండి వచ్చిన వారు; గొఱ్ఱెపిల్ల రక్తములో
తమ వస్త్రములను ఉదుకుకొని వాటిని తెలుపుచేసికొనిరి.'' పాపములు మురికిగా చెప్పబడి అది ఉదుకుట
ద్వారా పోగొట్టుకొన్నట్లుగా చెప్పబడింది.
ఈ మురికిగా ఉన్న వ్యక్తి మనకు ఎలాగున కనిపిస్తాడు? నల్లగా మురికిగానే కదా! ప్రకటన 16:8, ''నాలుగవ దూత తన పాత్రను సూర్యునిమీద కుమ్మరింపగా మనుష్యులను అగ్నితో కాల్చుటకు
సూర్యునికి అధికారము ఇయ్యబడెను.'' ఇలా ఎవరిని కాల్చుటకు సూర్యునికి అధికారము ఇయ్యబడింది? భూమిపై ఉన్న మనుష్యులను. కనుక భూమిపై యుగాంతములో పాపులే తప్ప
పరిశుద్ధులు ఉండరు కదా! కనుక ఎండ వేడి తగిలి మనుష్యులు నల్లబడుతారు. అలాగే పాపములో ఉన్న నరులను నల్లనిదానిగా
చెప్పుట జరిగింది. ఇలా
ఏకసంఘముగా ఉండవలసిన యెరూషలేము పవిత్రులు అపవిత్రులుగా విడిపోయి, పవిత్రమైనవారిని యెరూషలేము కుమార్తెలుగాను, అపవిత్రమైనవారిని
నల్లనిదియైన బబులోనుగాను వర్ణించుట జరిగింది. యిర్మీయా గ్రంథములోను, యెహెజ్కేలు 16:48-49లో దేవుడు తన ప్రవచనాలలో బబులోను
యెరూషలేమునకు అక్కగా వర్ణించుట యెరూషలేమును చెల్లెలుగా వర్ణించుట ఇద్దరు పాపములో మ్రగ్గుచున్నట్లుగా
చెప్పుచు ఇద్దరిని శిక్షిస్తానని అనేక ప్రవచనాలలో చెప్పబడింది. కనుక రెండుగా విడిపోయినను నరులమైన
మనమే మన క్రియల వలన అలా కనబడుచున్నాము కనుక పరమగీతములతో అలా వర్ణించుట జరిగింది. కాబట్టి ఆత్మరీత్యా ఆ నల్లనిదనము
పాపముల వలన దేవుని నుండి దూరముగా జీవించుట వలన వచ్చిందేగాని శరీరరీత్యా ఆమె చూచుటకు
సౌందర్యవంతురాలే.
ఇక ఇశ్రాయేలు చరిత్ర ప్రకారం చూసుకుంటే యాకోబు సొగసైన వాడే గాని తన
మామగారి ఇంటికి వచ్చాక ధన సంపాదన కోసం ఆస్తి కోసం మందలు కాచి నల్లగా మారిపోయాడు. సొగసు
లేని వాడుగా మారిపోయాడు! యాకోబుగారు 20 సంవత్సరాలు తనకోసం తన భార్యలకోసం సేవచేస్తే మరో 20 సంవత్సరాలు
ఆస్తికోసం మందలు కాచాడు ఆదికాండం 31:38 నుండి 41 వరకు జాగ్రత్తగా
పరిశీలన చేస్తే 40 సంవత్సరాలు హారానులో ఉన్నట్లు చూడగలము!
అక్కడ అనేక బాధలు అనుభవించాడు- ఎండకు ఎండిపోయాడు
వర్షానికి తడిచాడు- అడవి జంతువుల మధ్య క్రూర జంతువుల మద్య నివాసం
చేశాడు! సరియైన తిండి తినలేదు ఆస్తి సంపాదనలో! సౌందర్య వంతుడే గాని ఎండకు నల్లబడ్డాడు! గాని చివరలో
దేవునిచేత ఆశీర్వదించ బడ్డాడు! గొప్ప ఆస్తి మందలతో పనివారితో
తిరిగివచ్చాడు యాకోబు! కాబట్టి అబ్రాహాము- ఇశ్రాయేలు జాతి కోణంలో ఆ నల్లనివాడు యాకోబు! ఆస్తి కోసం
నల్లగా మారిపోయాడు! నల్లగా మారిపోయాడు గాని దేవుని చేత ప్రేమించ
బడ్డాడు దేవునిచేత ఆశీర్వదించ బడ్డాడు! ప్రియ సహోదరి సహోదరుడా
ఒకవేళ నీవు ఈ రోజు కనాను యాత్రలో శ్రమల సంకెళ్లలో నల్లగా మారిపోయావా? భయపడ వద్దు! నీవు దేవునిచేత ప్రేమించబడుతున్న కారణముననే
నీకు శ్రమలు శోధనలు అని మరచిపోవద్దు! ఈ రోజు నల్లగా ఉన్నా సరే-
షూలమ్మితి నల్లగా ఉన్నా ప్రియుడైన సోలోమోను రాజు ప్రేమతో పెండ్లి చేసుకున్నట్లుగా
నీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఒకరోజు నిన్ను వివాహం చేసుకోడానికి నల్లని దానివైనా
సరే- దేవుడు ఇష్టపడుతున్నాడు! యోసేపు కూడా
శ్రమలను అనుభవించాడు చివరికి ఐగుప్తు దేశానికే అధపతి అయ్యాడు! బాధలలోనే తన కుమారుడైన మనస్షే ను కానీ దేవుడు నాశ్రమలను జ్నాపకం చేసుకుని వాటిని
మరిచి పోయేటట్లు చేశాడు అన్నాడు! కాబట్టి విశ్వాసి శ్రమల జీవితమే
ఆ నల్లని రూపము! అయితే నీ జీవితం అలా ఉండాలి అంటే ఎక్కడైతే నిన్ను
నల్లనిది అని వెక్కిరించారో అక్కడే నీ అభివృద్ది చూసి దేవుణ్ణి మహిమపరిచేటంతగ మారిపోవాలి!
నీ మాట ప్రవర్తన అంతా మారిపోవాలి- నీవు ఆశీర్వాద
కారకంగా ఉండాలి-విజయవంతమైన జీవితం జీవించాలి- మనుష్యులను ప్రేమించాలి- క్రీస్తుకోసం ప్రజలను ఆకర్షించాలి!
ఇక కేదారువారి
గుడారములు వలె సొలొమోను నగరు తెరలువలె ఆమె అనగా బబులోను సౌందర్యవంతురాలనని చెప్పుచున్నది. ఇది ఈ లోకము చూచుటకు కనబడు వాటితో
పోల్చి అలంకార ప్రాయముగా చెప్పుట జరిగింది. గుడారములు చేయుటలో కేదారువారు ఆ దినములలో
ప్రసిద్ధిని పొంది యుండాలి, అలాగే సొలొమోను తన నగరమును నిర్మించినప్పుడు
అందులో తెరలు కట్టి ఆ నగరమును సుందరముగా చేసి ఉంటారు. ఆ రోజులలో
యెరూషలేము ఆలయము, సొలొమోను నిర్మించిన నగరము చాలా ప్రసిద్ధి చెందాయి. కనుక అలాంటి అద్భుతముగా కనిపించే
వాటితో పాపపు స్థితిలో ఉండి నల్లగా ఆత్మరీత్యా కనబడుచున్నను విడిపోయిన సంఘమైన బబులోను
సౌందర్యమును పోల్చుట జరిగింది.
దైవాశీస్సులు!!
*గీతాలకు
గీతము-పరమగీతము*
*10వ భాగము*
*నల్లనిదాననని
నన్ను చిన్న చూపులు చూడకుడి*
పరమగీతము 1:5,6
5. యెరూషలేము
కుమార్తెలారా, నేను నల్లనిదాననైనను సౌందర్యవంతురాలను కేదారువారి
గుడారములవలెను సొలొమోను నగరు తెరలవలెను నేను సౌందర్యవంతురాలను
6. నల్లనిదాననని నన్ను చిన్న చూపులు చూడకుడి.
నేను ఎండ తగిలినదానను నా సహోదరులు నామీద కోపించి నన్ను ద్రాక్షతోటకు
కావలికత్తెగా నుంచిరి అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని.
ప్రియులారా! ఇక 6వ
వచనం చూసుకుంటే నల్లనిదాననని నన్ను చిన్న చూపులు చూడకుడి.
నేను ఎండ తగిలినదానను నా సహోదరులు నామీద కోపించి నన్ను ద్రాక్షతోటకు
కావలికత్తెగా నుంచిరి అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని అని షూలమ్మితి అంటుంది.
అయితే
ప్రియులారా! గతభాగములలో ఎందుకు నల్లగా మారిపోయింది ఎందుకు అన్నలు కోపగించారు అన్నది అక్షరార్ధముగా
చూసుకున్నాము! అయితే ఆత్మీయ కోణంలో అన్నలు అనే సహోదరులు ఎవరు
అనేది చూసుకుందాం!
ప్రకటన గ్రంధము ప్రకారం 6:9—11 ప్రకారం సహోదరులు యూదులు, సహదాసులు శ్రమల కాలంలో చంపబడబోయే విడువబడిన క్రైస్తవులు,
ఇక దానియేలు గ్రంధం ప్రకారం, ప్రకటన గ్రంధం ప్రకారం – సహదాసులు
అనగా దేవుని దూతలు!
మరి
ఈ వచనములో కనబడే సహోదరులు ఎవరు?
నాకు
రెండు అర్ధాలు కనిపిస్తున్నాయి ప్రియులారా! ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే!
మొదటిది: నీ ఎదుగుదల నీ అభివృద్ది ఓర్చుకోలేని
నీ తోటివారు, నీ బంధువులు, నీ ఇరుగుపొరుగు
వారు, చివరకు నీ ఎదుగుదల ఓర్చుకోలేని నీ సంఘసభ్యులు! అందుకే వారు నీకు శ్రమలు శోధనలు కలిగిస్తున్నారు!
రెండవది: నీ ఆత్మీయ యాత్రలో నీవు దారి తప్పేటప్పుడు
నిన్ను ఖండించి గద్ధించి బుద్ధిచెప్పే నీ సంఘ కాపరులు!!
సరే, ఇంకా ముందుకు వెళ్లేముందు
ఇక్కడ నేను నల్లనిదానినని నన్ను చిన్నచూపులు చూపకండి నేను ఎండతగిలిన దానను అని షూలమ్మితి
అంటుంది!
దీనిని జాగ్రత్తగా ఆలోచన చేస్తే యెరూషలేము కుమార్తెలు షూలమ్మితిని చూసి నీవు
నల్లనిదానివి గాని ప్రియుడు రాజు సోలోమోను వెనుక తిరుగుతున్నావు అని హేళన చేయడం మొదలుపెట్టారు! అప్పుడు ఆమె ఓ స్త్రీలారా
నేను మీకంటే అందమైన దాననే ఒకప్పుడు, ఇప్పుడు నా అన్నలు నామీద
కోపగించి నన్ను తోటకు కాపలాగా పెట్టి నన్ను ఎండలో పనిచేయమన్నారు అందుకే ఇలా నల్లగా
మాడిపోయాను అని చెబుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచిస్తే నీ విశ్వాసయాత్రలో
అనేకమంది నిన్ను చిన్నచూపు చూసినా నీవు బాధపడకు! గురివద్దకు పరుగెత్తు!
ప్రియుడు తప్పక నిన్ను వరిస్తాడు! అయితే గమనించవలసిన
విషయం ఏమిటంటే యెరుషలేము కుమార్తెలు హేళన చేసినా రాజు సోలోమోను ఏమంటున్నారు-
షూలమ్మితి నీవు అధిక సుందరివి అధిక సుందరివి! సెహబాస్!
మనుష్యులు త్రోసివేసినా యెహోవా నిన్ను త్రోసివేయక చేరదీసే దేవుడు!
ఇక నీవు నల్లనిదానివి అని హేళనచేసిన అదే యెరూషలేము కుమార్తెలే ఒకరోజు
స్త్రీలలో అధిక సుందరి వగుదానా అంటూ పొగిడారు!!! కాబట్టి విమోచించ
బడిన నీవు దేవునిమీద విశ్వాసంతో కనిపెడితే ఎక్కడైతే అవమానించ బడ్డావో అక్కడే రెట్టింపు
ఆశీర్వాదమునకు ఘనతకు అర్హుడవు అవుతావు!! ఆమెన్!
ఆపో 6:1
లో విధవరాండరమీద చిన్నచూపు చూశారు సంఘములో! విశ్వాసి
నీవు అలాంటి చిన్నచూపు చూడవద్దు వారి స్థాయిని బట్టి! నీకు కుల
బేధం, రంగు బేధం, అంతస్తు బేధం ఉండకూడదు!
క్రీస్తు రక్తములో కడుగబడి బాప్తిస్మము పొందిన మనమంతా సహోదరులము ఒక తండ్రి
బిడ్డలము అని మరచిపోవద్దు!!
ఇక ఎండతగిలిన దానను అనగా యోసేపు జీవితం యాకోబు జీవితం ప్రకారం- శ్రమలు పొందిన వాడను/దానను అని అర్ధం! పాతనిబంధన భక్తులు క్రొత్త నిబంధన భక్తులు
దేవుని కోసం అనేక శ్రమలు సహించారు చివరకు మరణమై పోయారు! గాని
చివరకు గొప్ప ఘనత పొందారు! ఎప్పుడు దేవుని మీద నిందలు మోపలేదు!
కాబట్టి శ్రమలు పడుతున్న విశ్వాసులను చూసి హేళన చేయకూడదు తృణీక రించకూడదు!
దైవాశీస్సులు!!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*11వ భాగము*
*నా సొంత తోటను నేను కాయకపోతిని*
పరమగీతము 1:5,6
5.యెరూషలేము
కుమార్తెలారా, నేను నల్లనిదాననైనను సౌందర్యవంతురాలను కేదారువారి
గుడారములవలెను సొలొమోను నగరు తెరలవలెను నేను సౌందర్యవంతురాలను
6.నల్లనిదాననని నన్ను చిన్న చూపులు చూడకుడి. నేను ఎండ తగిలినదానను నా సహోదరులు నామీద కోపించి నన్ను ద్రాక్షతోటకు కావలికత్తెగా
నుంచిరి అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని.
ప్రియులారా! ఇక 6వ
వచనం చూసుకుంటే నల్లనిదాననని నన్ను చిన్న చూపులు చూడకుడి.
నేను ఎండ తగిలినదానను నా సహోదరులు నామీద కోపించి నన్ను ద్రాక్షతోటకు
కావలికత్తెగా నుంచిరి అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని అని షూలమ్మితి అంటుంది.
ప్రియులారా!
ఇంకా అంటుంది షూలమ్మితి నా సహోదరులు నామీద కోపించి నన్ను ద్రాక్షతోటకు
కావలికత్తెగా నుంచిరి అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని.
ఈ
మాటలు షూలమ్మితి అంటుంది.
షూలమ్మితి సోలోమోను వెనుక తిరుగుతుంది అని తెలుసుకుని అన్నలు కోపగించి
తమ ద్రాక్ష తోటకు కాపలాగా ఉంచితే ఆమె రాజుగారి తోటను కాయడానికి వెళ్తుంది!
అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని అని తన బాధను ఇందులో నల్లనిదైన
షూలమ్మితి అనే శ్రమల పాలైన సంఘము చెప్పుట చదువగలము. పాతనిబంధనలో అబ్రాహాము కుమారుడైన
యాకోబును మరల ఎన్నుకొని ఇశ్రాయేలీయులను తన రాజ్యముగా యాజకులుగా ఎన్నుకొన్నాడు.. అప్పుడు తమ స్వంత తోటను కావలి కాస్తుంటే
దానిలో ఉండి తమ స్వంత తోటలను కాయవలసిన నల్లని కుమార్తెలు యెరూషలేమునకు బయట అన్యజాతులుగా
అక్కడ తోటలను కాస్తున్నారు. ఈనాడు క్రీస్తు ప్రభువు క్రైస్తవ సంఘమును యెరూషలేము సంఘముగా ఏర్పరిస్తే క్రైస్తవులు
అను విశ్వాసులు రాజులైన యాజకులుగా చర్చీలను కావలి కాస్తూ దానిలోని ద్రాక్షావల్లియైన
క్రీస్తు ప్రభువును ఆరాధిస్తూ తమ స్వంత తోటను అనుభవిస్తున్నారు. యోహాను 15:1, ''నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు.'' నిజమైన ద్రాక్షావల్లిగా క్రీస్తు
ప్రభువు దానిని నాటిన వ్యవసాయకునిగా తండ్రియైన దేవుడు ఉన్న సంఘమే నేటి క్రైస్తవ సంఘము. ఈ సంఘములో అంటుగట్టబడి జీవించమని
మనకు దేవుడు చెప్పుచున్నారు. యోహాను 15:5, ''ద్రాక్షావల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును;
నాకు వేరుగా ఉండి మీరేమియు చేయలేరు.'' ఇందులో చెప్పబడిన విధముగా మనము క్రైస్తవ
సంఘమును కాపు కాస్తూ అందులో అంటుగట్టబడి జీవిస్తే మనము నిజ క్రైస్తవులుగాను రాజులైన
యాజకసమూహముగా ఎన్నిక చేయబడుదుము. కాని అనేకులు విగ్రహారాధనలో అన్య దేవతలు దేవుళ్లను పూజిస్తూ నిజదైవమునకు దూరముగా
ఉంటూ పాపములో మ్రగ్గి నల్లనైన బబులోనుగా ఉంటూ కారు ద్రాక్షలైన అన్యదేవతలను కావలి కాస్తూ
ఉన్నారుగాని తమ స్వంత ద్రాక్ష తోటను కావలి కాయలేకపోవుచున్నారు.
ఇక మరో అర్ధము కూడా చెప్పనీయండి! నేటి రోజులలో ఈ వాక్యము
అనేకమంది దైవజనులను సూచిస్తుంది! దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన
తన సంఘానికి నిన్ను కాపలాగా పెడితే కొన్నిసార్లు నీ సంఘమును కాయకుండా ఇతరుల సంఘాలను
బలపరుస్తున్నారు కొంతమంది దైవసేవకులు! ముఖ్యంగా మొదటగా మంచి వాక్చాతుర్యము
ఇచ్చి విరివిగా వాడబడే దైవసేవకులు! తమ స్వంత సంఘాలకు కొంత సమయమే
ఇస్తున్నారు గాని ఇతర సంఘాలకు వెళ్ళి బలపరుస్తున్నారు! వీరుకూడ
అనేకసార్లు ఇలాగే బాధ పడుతున్నారు! గాని నేనంటాను – దేవుడు
నీకు అప్పగించిన బాధ్యతను వదలకుండా దానిని కూడా చేయాలి గాని- నీ సంఘాన్ని అశ్రద్ద చేసి కొంతమంది- కానుకలను ఆశించి
కొంతమంది- మా దగ్గరకు రండి మా దగ్గరకు రండి అని పిలుస్తుంటే మొగమాటంతో
తమ సంఘాలను వదిలి ఇతర సంఘాలలో ప్రకటిస్తున్నారు- ఏమో నాకు తెలియదు
గాని నేను అనుకుంటాను నీ సంఘాన్ని కాయవలసిన బాధ్యత నీది- దానిని
మరొకరికి దేవుడు అప్పగించ మంటేనే నీవు అప్పగించాలి గాని దేవుణ్ణి ఆడగకుండా ఆదివారం
కూడా మరో సంఘములో బోధించడం మంచిది కాదు అని నా ఉద్దేశం! నీ సంఘ
సభ్యులు వారి గృహ కూటములకు ఫంక్షన్ లకు మంచివాటికి చెడ్డవాటికి నీవు రావాలని ఆశ పడతారు-
కాబట్టి వారి ఆశను భంగం చేయడం మంచిది కాదు అని నా ఉద్దేశం!
ఇక మరో గుంపు- పాస్టర్ ఫెలోషిప్ లో ఉంటున్న అనేకమైన కాపరులు!
వీరు – ఫెలోషిప్ వారు పిలుస్తున్నారు అని
వీరి సంఘములో జరిగే పెళ్లి మరియు కధా కార్యక్రమములకు ఇతర సేవకులను పిలుస్తున్నారు.
వారు ఇక్కడికి వీరు అక్కడికి వెళ్తున్నారు. మంచిదే-
గాని కొన్ని సమయాలలో మీ సంఘములో జరిగే కార్యక్రములకు హాజరు అవ్వడం కష్టమవుతుంది
కొంతమంది దైవసేవకులకు! సంఘము లేక సంఘములు పరిచర్య లేని కాపరులకు
ఇబ్బంది లేదు గాని ఒక సంఘము కంటే ఎక్కువ సంఘాలు – మంచి పరిచర్య
ఉన్న సంఘ కాపరులకు ఇది కష్టమవుతుంది- అపుడు వారు తమ స్వంత సంఘాలను
చూడకుండా/ కాయకుండా ఇతర సంఘాలను కాస్తున్నారు! ఇది మంచిది కాదు అని నా ఉద్దేశం! కాబట్టి దేవుడు నీకు అప్పగించిన సంఘమును అశ్రద్ద చేయకుండా ఇతర సంఘాలకు
వెళ్ళడం తప్పులేదు గాని నీ సంఘాన్ని పట్టించు కోకుండా పేరు కోసమో, డబ్బు కోసమో, మొగమాటం కోసమో వెళ్ళడం తప్పు అని నా ఉద్దేశం!
ఇక చివరిగా
షూలమ్మితిని అన్నలు తమ తోటను కాపలా కాయమంటే షూలమ్మితి రాజుగారి తోటను కాచినది అనగా
దేవుని పరిచర్య అంటే సంఘము అంటే షూలమ్మితికి చాలా ఇష్టం! కాబట్టి
విశ్వాసులు కాపరులు రక్షించబడిన వారు ఎవరైనా రాజుగారి తోటలో పరిచర్య తప్పకుండా చేయాలి-
దానికి నీ సమయాన్ని కేటాయించాలి! సేవా పరిచర్యలలో
ముందుకు పరుగెత్తాలి! మొదట దేవుని రాజ్యమును నీతిని వెతకాలి!
సారెపతు విధవరాలి వలె మొదట రొట్టె దేవునికి ఇవ్వాలి తద్వారా కరువులోనూ
కూడా ఆశీర్వదించ బడి కరువునుండి తప్పించుకుంది! నీకు ఎన్ని ఇబ్బందులు
శ్రమలు శోధనలు ఉన్నా గాని దేవుని పనికోసం విసుకక పరుగెత్తాలి అప్పుడే నీకు దేవుని దీవెనలు
మెండుగా నిండుగా క్రుమ్మరించ బడతాయి! ప్రియ చదువరీ! మరి నీవు రాజుగారి తోటలో పనిచేయడానికి సిద్దంగా ఉన్నావా? చిన్న కుమారుని వలె వెళ్తాను అని చెపి వెళ్ళకుండా ఉంటావా? లేక పెద్ద కుమారుని వలె మనసు మార్చుకుని ప్రభువు తోటలో పనిచేస్తావా?
దైవాశీస్సులు!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*12వ భాగము*
*నా ప్రాణ ప్రియుడా, నీ మందను నీవెచ్చట
మేపుదువో*
పరమగీతము 1:7
నా ప్రాణ ప్రియుడా, నీ మందను నీవెచ్చట మేపుదువో
మధ్యాహ్నమున నెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము ముసుకువేసికొనినదాననై నీ జతకాండ్ల
మందలయొద్ద నేనెందుకుండవలెను?
ప్రియులారా! ఇక 7వ వచనం చూసుకుంటే నా ప్రాణ ప్రియుడా
అని పిలుస్తుంది షూలమ్మితి సోలోమోను రాజును! విశ్వాసులు ఎప్పుడూ
క్రీస్తు సాన్నిహిత్యాన్నీ ప్రేమనూ అనుభవించాలని కోరుతారు. ఆయన
వారినెన్నడూ విడిచిపెట్టడు (హెబ్రీయులకు 13:5, ధనాపేక్షలేనివారై
మీకు కలిగినవాటితో తృప్తిపొందియుండుడి. నిన్ను ఏమాత్రమును విడువను,
నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా. ; యోహాను 14:16-18, ; మత్తయి 28:20, నేను మీకు ఏయే సంగతులను ఆజ్ఞాపించితినో
వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి
వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పెను). అయితే
ఆయన సాన్నిహిత్యం, ప్రేమల గురించి వారి అనుభవానికి ఆటూ పోటులున్నట్టు
కనిపిస్తుంది. ఒక్కోసారి అయితే వారి అనుభవంలో క్రీస్తు పూర్తిగా
వారిని వదిలివెళ్ళిపోయినట్టుంటుంది. మన స్వంత తోటను కాపాడుకోకపోతే
ఇలా జరగడానికి అవకాశాలు ఎక్కువౌతాయి. ఇలాంటిది సంభవించినప్పుడు
ఆయన్ను హృదయపూర్వకంగా వెతకాలి (హోషేయ
10:12, నీతి ఫలించునట్లు మీరు విత్తనము వేయుడి ప్రేమయను కోత మీరు కోయుడి,
యెహోవాను వెదకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీమీద నీతివర్షము
కురిపించునట్లు ఇదివరకెన్నడును దున్నని బీడుభూమి దున్నుడి. ; యిర్మియా 29:13, మీరు నన్ను వెదకిన యెడల, పూర్ణమనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు
).
ఇక ఈ గ్రంధములో షూలమ్మితి ప్రియుడా అని
34 సార్లు పిలిచినట్లు చూడగలము! ఎందుకు అన్ని సార్లు
పిలిచింది అంటే షూలమ్మితికి సోలోమోను కంటే తన ప్రాణమునకు ఇష్టుడు గాని ఘనుడు గాని ఎవరూ
లేరు! ప్రాణప్రదంగా ప్రేమిస్తుంది షూలమ్మితి సోలోమోనుని!
అలాగే సంఘము కూడా ప్రియుడైన యేసుక్రీస్తుప్రభులవారిని ప్రాణము కంటే ఎక్కువగా
ప్రేమించవలసిన అవసరం ఉంది. ఎఫెసీ 1:6—7 ప్రకారము
6 మనము తన యెదుట పరిశుద్ధుల మును నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది
వేయబడకమునుపే, ప్రేమచేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను.
7 దేవుని కృపామహదైశ్వర్యమునుబట్టి
ఆ ప్రియునియందు ఆయన రక్తమువలన మనకు విమో చనము, అనగా మన అపరాధములకు
క్షమాపణ మనకు కలిగియున్నది.
ఇంతటి ప్రేమ దేవుడు మనయెడల చూపించారు
కాబట్టి మనము కూడా అదే ప్రేమను చూపించవలసిన అవసరం ఉంది!
లోకంలో ఉన్న అందరికంటే ఎక్కువగా క్రీస్తు యేసును నీవు ప్రేమించాలి
సరే, ఈ 7 వ వచనంలో ఒక కాపరి కనిపిస్తున్నాడు! ఆ కాపరిని ఈ షూలమ్మితి
అడుగుతుంది నా ప్రాణ ప్రియుడా నీ మందలను నీవు ఎక్కడ మేపుతున్నావో నాకు చెప్పు-
నేను అక్కడికి వస్తాను అంటుంది. గమనించాలి గతంలో
చెప్పడం జరిగినది- సోలోమోను రాజు షూలమ్మితి కోసం కొన్నిరోజు గొల్లపిల్ల
వానివలె నటించి షూలమ్మితికి దగ్గరౌతాడు!
సరే, ఇక్కడ ఆ గొర్రెల కాపరి
ఎవరో కాదు! యేసుక్రీస్తుప్రభులవారే! యోహాను 10 వ అధ్యాయములో ఆయన అంటున్నారు
14 నేను గొఱ్ఱల మంచి కాపరిని.
మొదటనుంది
చూసుకుంటే
2 ద్వారమున ప్రవేశించువాడు గొఱ్ఱల కాపరి.
3 అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొఱ్ఱలు అతని స్వరము వినును, అతడు తన సొంత గొఱ్ఱలను పేరుపెట్టి
పిలిచి వాటిని వెలుపలికి నడి పించును.
4 మరియు అతడు తన సొంత గొఱ్ఱలనన్నిటిని వెలుపలికి నడిపించునపుడెల్ల
వాటికి ముందుగా నడుచును; గొఱ్ఱలు అతని స్వరమెరుగును గనుక అవి
అతనిని వెంబ డించును.
5 అన్యుల స్వరము అవి యెరుగవు గనుక అన్యుని ఎంతమాత్రమును
వెంబడింపక వానియొద్దనుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను.
7 కాబట్టి యేసు మరల వారితో ఇట్లనెను
8 గొఱ్ఱలు పోవు ద్వారమును నేనే; నాకు ముందు వచ్చిన వారందరు దొంగలును దోచుకొనువారునై యున్నారు; గొఱ్ఱలు వారి స్వరము వినలేదు.
9 నేనే ద్వారమును; నా ద్వారా ఎవడైన
లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షింపబడినవాడై, లోపలికి పోవుచు
బయటికి వచ్చుచు మేత మేయుచునుండును
ఇంకా
అంటున్నారు 11 నేను గొఱ్ఱలకు మంచి కాపరిని; మంచి కాపరి గొఱ్ఱలకొరకు తన ప్రాణము పెట్టును.
అలాగే
చెప్పిన విధంగా గొర్రెలమైన మనకోసం ఆయన తన ప్రాణము పెట్టారు!
అయితే
మిగతా కాపరులు కోసం మత్తయి
10:16 లో అంటున్నారు 16 ఇదిగో తోడేళ్లమధ్యకు గొఱ్ఱలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాములవలె
వివేకులును పావురములవలె నిష్కపటులునై యుండుడి.
ఇంకా
కీర్తనల గ్రంధంలో 74 లో 1 దేవా, నీవు నిత్యము మమ్మును విడనాడితివేమి? నీవు మేపు గొఱ్ఱలమీద
నీ కోపము పొగరాజు చున్నదేమి? ఇక్కడ దేవుడు తన గొర్రెలను మేపుచున్నాడు
73: 13 అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొఱ్ఱలమునైన మేము
సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచెదము.
100: 3 యెహోవాయే దేవుడని తెలిసికొనుడి ఆయనే మనలను పుట్టించెను
మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొఱ్ఱలము.
అందుకే
23 వ కీర్తనలో ఈ విషయం గ్రహించి దావీదు గారు అంటున్నారు యెహోవా నా కాపరి
నాకు లేమి కలుగదు అంటున్నారు! అయితే ఇట్టి గొర్రెలమైన మనము భళా
నమ్మకమైన మంచి దాసుడా అని పిలిపించుకునే విధంగా ఉండాలి గాని సోమరివైన చెడ్డదాసుడా అని
పిలిపించుకో కూడదు! అంతేకాకుండా మత్తయి 25 లో చెప్పబడిన కుడివైపున నిలువబడే గొర్రెల వలె ఉండాలి గాని ఎడమవైపున నిలబడ్డ
మేకలవలే ఉండకూడదు అని గ్రహించాలి! ఫలితం- గొర్రెలు దేవుడు చేసిన పరలోకమునకు వెళ్లారు- మేకలు అపవాదికి
వాడి దూతలకు సిద్దపరచిన నరకానికి పోయారు! మరి ఇప్పుడు నీవు ఎక్కడికి
పోవాలో నీవే నిశ్చయం చేసుకో!! ఆ పరమ కాపరి ఎక్కడ తన మందను కాస్తున్నారో
ఆ మందనే వెంబడించు గాని బిర్యానీ పొట్లాలు ఇస్తున్నారు అని, పిట్టకధలు
సైన్సు చెబుతున్నారు అని, అంతా ac చర్చే
అని గాని, శ్రావ్యమైన సంగీతం జిగేల్ జిగేల్ మనే లైట్లు ఉన్నాయని
మోసపోయి వెళ్ళావా? నరకానికి పోతావు అని గ్రహించు! అవును నీ కాపరి కాబట్టి సరియైన దారిలో వెళ్లకపోతే సరిగా తినకపోతే నడ్డిమీద
కర్రతో ఒకటిస్తాడు ఎందుకంటే నీవంటే నీకాపరికి ఇష్టం- నీవు పాడై
పోకూడదు! అందుకే ఖండించి గద్దించి బుద్ధి చెప్పే వాక్యం చెబుతున్నాడు-
మరొకడు నీకు మసిపూసి నిన్ను పొగడుతూ నీవలన లాభం సంపాదించుకుంటూ నిన్ను నరకానికి తీసుకుని పోతున్నాడు!
ఏది కావాలో తేల్చుకో!!
దైవాశీస్సులు!!!
గీతాలకు గీతము-పరమగీతము
13వ భాగము
నారీమణీ, సుందరీ
పరమగీతము 1: 8 నారీమణీ, సుందరీ, అది నీకు తెలియకపోయెనా? మందల యడుగుజాడలనుబట్టి నీవు పొమ్ము మందకాపరుల గుడారములయొద్ద నీ
మేకపిల్లలను మేపుము.
ప్రియులారా! ఇక 8వ వచనం చూసుకుంటే ఈ గ్రంధంలో సోలోమోను రాజు
మొదటగా జవాబు ఇస్తున్నాడు షూలమ్మితి అడిగిన ప్రశ్నకు జవాబుగా! షూలమ్మితి అడిగినది:
నా ప్రాణ ప్రియుడా, నీ మందను నీవెచ్చట మేపుదువో మధ్యాహ్నమున
నెచ్చట నీడకు వాటిని తోలుదువో నాతో చెప్పుము ముసుకువేసికొనినదాననై నీ జతకాండ్ల
మందలయొద్ద నేనెందుకుండవలెను?
దానికి
జవాబుగా నారీమణీ అని పిలుస్తూ అది నీకు తెలియదా! నా మందల అడుగుజాడలను వెంబడించు, నా మందకాపరులు
వేసుకున్న గుడారాల వద్ద నీ మేకపిల్లలను మేపు అని జవాబు చెబుతున్నాడు సోలోమోను!
దీని ఆత్మీయ అర్ధం సూటిగా: మనం
జాగ్రత్తగా వెతికితే క్రీస్తు తన మందగా ఉన్న విశ్వాసులను ఎక్కడికి తీసుకు వెళ్ళాడో
కనిపిస్తుంది. అప్పుడు ఆ పవిత్రుల అడుగు జాడల్లో మనమూ వెళ్ళవచ్చు. క్రీస్తు
నియమించిన సంఘ కాపరుల సహవాసంలోనూ, ఆయన మందను మేపడం ద్వారానూ ఆయన్ను మనం తిరిగి
కలుసుకుంటాం (యోహాను 21:15-17, ; యోహాను 14:21, ). ఇక్కడ వధువును “అతిలోక సౌందర్యవతీ” అని అభివర్ణించడం గమనించండి (పరమగీతము 1:15, ; పరమగీతము
2:14, ; పరమగీతము 4:1, , పరమగీతము 4:7,
; పరమగీతము 6:4, ; పరమగీతము 7:1, , పరమగీతము 7:6, ; కీర్తనల గ్రంథము 45:11, కూడా చూడండి).
లోకమంతటిలోనూ
క్రీస్తు దృష్టిలో ఆయన సంఘమే అత్యంత సౌందర్యవంతమైనది. ఆయన దానిని ప్రేమ దృక్కులతో
చూస్తాడు. ఇకముందు తన కృప మూలంగా ఆమె ఏమి కానున్నదో చూస్తాడు (ఎఫెసీయులకు 5:26-27, ). దేవుడు ఆమెకిచ్చిన అందాన్ని చూస్తాడు. విశ్వాసులు క్రీస్తులోనివారే. ఆయనతో
ఐక్యమై ఉండడంవల్ల ఆయనకున్నదంతా వారిదే.
గత వచనంలో షూలమ్మితి సోలోమోనును నా ప్రాణ ప్రియుడా అని పిలిస్తే
ఇక్కడ ప్రియుడైన సోలోమోను నారీమణీ అంటూ నా సుందరి అంటు పిలుస్తున్నారు!
సరే, ఒకసారి నారీమణి కోసం ఆలోచిస్తే- ఆదికాండం 2 వ అధ్యాయం ప్రకారం నరుని నుండి తీయబడింది కాబట్టి నారీ అనబడును అని
స్త్రీ కోసం చెప్పబడింది. అయితే ఇలా ఏర్పడిన నారీలలో అందరికంటే మణిగా, మణి భూషణముగా అందరికంటే సుగుణాల సంపన్నగా ఉండేదో నారీమణి! ఆత్మీయ కోణంలో
చూసుకుంటే సంఘములో లోకములో అందరికంటే పాపములేనిదిగా మచ్చలేనిదిగా కళంకము లేనిదిగా
ఉన్నప్పుడే ఆ సంఘములో ఆ వ్యక్తి నారీమణిగా చెలామణి అవుతుంది. అనగా మచ్చలేని
పవిత్రమైన జీవితం జీవించడమే నారీమణిగా ఉండటం! ఇది సంఘము కోసం
యేసుక్రీస్తుప్రభులవారు చెప్పిన మాట అని గ్రహించాలి!
షూలమ్మితి తన ప్రాణము
కంటే ఎక్కువగా సోలోమోనును ప్రేమించింది! అలాగే సోలోమోను తన ప్రాణముకంటే ఎక్కువగా
షూలమ్మితిని ప్రేమిస్తున్నారు! అలాగే యేసుక్రీస్తుప్రభులవారు సంఘాన్ని ఎంతగానో
ప్రేమించారు
యోహాను 3:16
దేవుడు లోకమును
ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు
ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.
ఇంతగా
ప్రేమించారు దేవుడు!
అయితే
ఇంకా లోతుగా ఆలోచిస్తే ఎఫెసీ పత్రిక 5 లో
అంటున్నారు పౌలుగారు
25 పురుషులారా, మీరును మీ
భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి,
26 అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక,
పరిశుద్ధమైనదిగాను,
27 నిర్దోష మైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట
దానిని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదకస్నానముచేత
దానిని పవిత్రపరచి, పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్ను తాను
అప్పగించుకొనెను.
ఇంతగా
ప్రేమించారు యేసయ్య!
ఇదే
క్రమము దేవుడు మనకు చూపించారు! యోహాను 13:15 లో యేసుక్రీస్తుప్రభులవారు శిష్యుల
పాదాలను కడిగి వారితో అన్నారు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను- మీరు సంఘాన్ని
ప్రేమించి నేను తగ్గించుకున్నట్లు మీరు తగ్గించుకుని సంఘాన్ని ప్రేమించమని
చెప్పారు! ఈ మాదిరి జీవితం మనం అలవర్చుకోవాలి!
1 తిమోతి 4:11,12 లో తిమోతికి
లేఖ రాస్తూ తిమొతి నీవు మాటలోనూ ప్రవర్తన లోనూ ప్రేమలోనూ విశ్వాసులకు మాదిరిగా
ఉంటూ ప్రేమగా నడుచుకో అన్నారు!
తీతు
2 వ
అధ్యాయములో సత్క్రియలు చేయడంలో మాదిరిగా నడుచుకో అంటున్నారు!
ఇక
మందకాపరుల అడుగు జాడలలో నడచుకో అంటున్నారు! ఫిలిప్పీ 3:17 లో అంటున్నారు సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకొనుడి అంటూ
మేము మీకు మాదిరియై ఉన్న ప్రకారము అలా నడుచుకొను వారిని గురిపెట్టి చూడుడి
అంటున్నారు
2 థెస్స 3:9 లో మీము మమ్మును
పోలి నడుచుకోవాలని మమ్మును మేము మీకు మాదిరిగా కనుపరుచుకున్నాము అంటున్నారు
ఇక యాకోబు గారు అంటున్నారు 5:10 లో
నా సహోదరులారా ప్రభువు నాముమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును
మాదిరిగా పెట్టుకొనుడి అంటున్నారు!
కాబట్టి
1 పేతురు 2:21 ప్రకారం క్రీస్తు అడుగుజాడలయందు
నడుచుకొనేలాగా మీకు మాదిరిగా ఉంచిపోయేను అన్నట్లుగా మొదట క్రీస్తును పోలి ఆయన
అడుగుజాడలలో నడుచుకోవాలి!
రెండవదిగా
ఏలీషా గారు ఏలీయాను అనుసరించి నడిచి రెండింతల ఆత్మను పొందుకున్నట్లుగా మనము కూడా ఆ
భక్తుల అడుగుజాడల లోనూ,
మన సంఘ కాపరుల అడుగుజాడలను అనుసరిస్తూ నడుచుకుంటూ గురివద్దకు
పరుగెత్తాలి!
మరి
నీవు సిద్దమా ?
దైవాశీస్సులు!!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*14వ భాగము*
*ఫరోయొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను*
పరమగీతము 1: 9 నా ప్రియురాలా, ఫరోయొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను.
ప్రియులారా! ఇక 9వ
వచనం చూసుకుంటే నా ప్రియురాలా, ఫరోయొక్క
రథాశ్వములతో నిన్ను పోల్చెదను అంటున్నారు!
గతంలో
ఈజిప్ట్ గుర్రాలు చూపులకు ఇంపుగాను, మంచి శిక్షణ గలిగిన ఉత్తమాశ్వాలుగానూ ఉన్నాయి.
వాటిని ఇతర దేశాలవాళ్ళు కొనుక్కొన్నారు (1 రాజులు
10:28-29, ). ఈజిప్ట్ రాజు ఉపయోగించేవి శ్రేష్ఠాతిశ్రేష్ఠమైన గుర్రాలు.
వాటికి ఎక్కువ అలంకరణ, అందం ఉండేవి.
అలా సంబోధిస్తూనే
ఫరోయొక్క రథాశ్వములతో ఆమెను పోల్చెదను అని చెప్పుచున్నారు. ఐగుప్తు దేశపు రాజును ఫరోగా పిలుస్తారు. రాజు వద్ద అవి బలిష్ఠమైన దృఢమైనవిగా
ఉంటాయి. సాధారణ అశ్వములకు రాజు వద్ద ఉండు అశ్వములకు చాలా తేడా
ఉంటుంది. ఇలాంటి బలమైన
దృఢమైన అశ్వములతో వీరిని పోల్చుచున్నాడు.
అలాగే ఆభరణ హారములతో అలంకరించబడిన స్త్రీ బహుసుందరముగా కనిపిస్తుంది. ఏమి కొదువ లేనివారుగా కనిపిస్తారు. అలా కనిపించినను వారు ఇంకా రాజులైన
యాజకులుగా మారలేదు గనుక వారిని ఫరో రాజు అశ్వములతో పోల్చుట జరిగిందిగాని దావీదు లేక
సొలొమోను వంటి దైవప్రజల రాజుల అశ్వములతో పోల్చలేదు. అంతమాత్రాన వారు తక్కువవారేమి కాదు.
పాపములో ఉన్నారు. మారుమనస్సు కలిగి తిరిగి క్రీస్తు
ప్రభువు వద్దకు వస్తున్నారు. ఇలాంటివారి విషయములో క్రీస్తు ప్రభువు
బహుగా ఆనందించునని గ్రహించాలి.
నేను చదివిన చరిత్ర ప్రకారం ఫారో యొక్క రధమునకు ఉన్న గుర్రాలు చాలా
వడిగా పరుగెత్తుతాయి- ఎందుకు పరుగెత్తుతాయి అంటే- ఫారో
యొక్క రధములకు ఉండే గుర్రాలు రెండూ మగవి కావట! ఒకటి మగది రెండవది
ఆడది! ఈ ఆడ గుర్రము ఎంతో అందంగా ఉంటుంది. తనతోపాటుగా తన జత స్త్రీ గుర్రము వచ్చింది అని ఆ మగ గుర్రము ఎంతో ఉత్సాహముగా
పరుగెత్తుతుంది. ఇక ఆ ఆడ గుర్రానికి ఎన్నెన్నో అలంకారాలు పెడతారు!
ఇదీ ఫారో యొక్క రధము యొక్క గుర్రాల సంగతి!
అదే సమయంలో మర్చిపోకూడానిది ఏమిటంటే ఒక గుర్రమే బలమైనది మరో గుర్రం బలహీనమైనది! కాబట్టి ఎంతో జాగ్రత్తగా
ఉండాలి సంఘము!
సంఘములో కొంతమంది విశ్వాసం లో బలవంతులు మరికొందరు విశ్వాసం లో బలహీనులు ఉంటారు. ఇలాంటి బలహీనులను బలవంతులు
కలుపుకుని వారిని ప్రోత్సాహపరుస్తూ తమతోపాటు తీసుకుని వెళ్ళవలసిన అవసరం ఉంది!
అందుకే సోలోమోను గారు షూలమ్మితి ని ఫారో యొక్క రధము యొక్క గుర్రముతో
పోల్చడం జరిగింది!
అయితే బైబిల్ చెబుతుంది ఈ రధముల మీద ఆశ పడవద్దని రాజులతో చెప్పడం జరిగింది. ఇదే ఫారో రధములు గర్వించి
నప్పుడు ఎర్ర సముద్రంలో మునిగిపోయినట్లు చూడగలము!!
ఇక గుర్రముల కోసం చూసుకుంటే లేవీ 11:1—8 ప్రకారం
గుర్రములు అపవిత్రమైన జంతువులు! కాబట్టి మనలో అపవిత్రత కనబడకూడదు!
కీర్తనలు 20:7 ప్రకారం గుర్రాలు అతిశయం గలవి! మనలో కూడా అతిశయం ఉండకూడదు!
కీర్తనలు 33:17 ప్రకారం గుర్రాలకు విశేష బలం ఉంది, వాటిని చూసి అతిశయ పడకూడదు మనము! అలాగే నీలో ఉన్న తలాంతులు
వరాలు ఫలాలు చూసి అతిశయ పడ్డావా? నాశనమే నీకు అని మరచిపోవద్దు!
యిర్మీయా
8:6 ప్రకారం గుర్రాలకు రెండు లక్షణాలు ఉన్నాయి. మొదటిది చెడుగును చూసి పశ్చాత్తాప పడదు, రెండు తనకిష్టమైన
మార్గాన అది ప్రయాణం చేస్తుంది. ఈ రెండు విశ్వాసిలో ఉండకూడదు!
చెడుగును అసహ్యించుకుని దూరంగా ఉండాలి విశ్వాసి! ఇంకా నీకిష్టమైన మార్గములో కాకుండా దేవుని మార్గాలలో వాక్యపు వెలుగులో జీవిస్తేనే
పరలోకం!
అట్టివిధముగా
పాపమునకు దూరంగా, విశ్వాసహీనులను బలపరుస్తూ క్రీస్తులో ముందుకు సాగుదాం!
దైవాశీస్సులు!!!
*గీతాలకు గీతము-పరమగీతము*
*15వ భాగము*
*ఆభరణములచేత నీ చెక్కిళ్లును*
పరమగీతము 1: 10 ఆభరణములచేత నీ చెక్కిళ్లును
హారములచేత నీ కంఠమును శోభిల్లుచున్నవి.
11 వెండి పువ్వులుగల బంగారు సరములు మేము నీకు చేయింతుము
ప్రియులారా! ఇక 10వ
వచనం చూసుకుంటే ఆభరణములచేత నీ చెక్కిళ్లును హారములచేత నీ కంఠమును
శోభిల్లుచున్నవి అని సోలోమోను షూలమ్మితితో అంటున్నారు!
చెక్కిళ్లు అనగా అనగా బుగ్గలు అంటే బుగ్గల వరకు ఉండే ఏదో ఆభరణం షూలమ్మితి వేసుకుని
ఉంటుంది. ఇక కంఠములో ఏదో మంచి హారము వేసుకుని ఉంది అని అర్ధమవుతుంది. దానివలన నీ అందము ఎంతో శోభిల్లుచున్నది అని అంటున్నాడు సోలోమోను!
దీనికోసం ధ్యానం చేసేముందు – మీరు అనవచ్చు
అక్కడ షూలమ్మితి ఆభరణములు వేసుకున్నట్లు కనిపిస్తుంది కదా- మీరు
ఎందుకు ఆభరణములు వేసుకోవద్దు అంటున్నారు అని నన్ను అడగవచ్చు! తిమోతి పత్రిక ప్రకారం, పేతురు పత్రిక ప్రకారం వెండి
బంగారంతో చేయబడిన ఆభరణాలు మీకు అలంకారాలుగా ఉండక సాధువైనట్టి మృధువైనట్టి గుణమునే అక్షయ
అలంకారముగా చేసుకోండి అంటున్నారు- కాబట్టి ఈ ఆభరణముల వైపు చూడకుండా
అక్షయ అలంకారాలు అయిన ఈ మంచి గుణములు దేవుని వరములు ఫలములతో అలంకరించుకోవడమే ఉండాలి
తప్ప వెండి బంగారు ఆభరణముల మీద మన ఆశ చూపు ఉండకూడదు అని మనవి చేస్తున్నాను!
ఇక ఆ హారములు మరియు ఆభరణములు మరొక ఆత్మీయ అర్ధముతో మాట్లాడటం చేస్తున్నారు
తప్ప అక్షరార్ధమైన హారములు ఆభరణములు కాదు అని మనవిచేస్తున్నాను. ఇక్కడే కాదు ఈ గ్రంధములో కనిపించే ప్రతీ ఆభరణము ఒక ప్రత్యేకమైన గుణమును ఆధ్యాత్మిక
అర్ధమును సూచిస్తుంది అని చదువరులు గ్రహించమని మనవిచేస్తున్నాను!
ప్రియులారా నిజానికి ఈ వచనం ఇశ్రాయేలు
ప్రజల కోణంలో చూసుకుంటే ఐగుప్తు బానిసత్వము నుండి విడుదలను సూచిస్తుంది ఈ 9—11 వచనాలు!
9 నా ప్రియురాలా, ఫరోయొక్క రథాశ్వములతో
నిన్ను పోల్చెదను.
10 ఆభరణములచేత నీ చెక్కిళ్లును హారములచేత నీ కంఠమును
శోభిల్లుచున్నవి.
11 వెండి పువ్వులుగల బంగారు సరములు మేము నీకు చేయింతుము
ఈ
మాటలు ప్రియుడైన సోలోమోను ప్రియురాలు షూలమ్మితి తో పలికిన మాటలు! ఇశ్రాయేలు జాతికి దేవుడు
మీరు ఐగుప్తు బానిసత్వము విడుదల కలిగి వచ్చేటప్పుడు వట్టి చేతులతో రాకుండా వారి వెండి
బంగారు నగలు అడిగి తీసుకుని వారిని దోచుకోండి అని సెలవిచ్చారు నిర్గమ 11:1—2; 12:35;
ఎందుకు వారిని దోచుకున్నారు అంటే ఇశ్రాయేలు ప్రజలచేత ఐగుప్తు వారు జీతం ఇవ్వకుండా
కఠినమైన దాస్యము చేయించుకున్నారు గనుక ఆ జీతముగా దేవుడే ఆ ఆభరణములు అడిగి తీసుకుని
వారిని దోచుకోమన్నారు! ఐగుప్తు ప్రజలకు అనుమానం రాకుండా ఇశ్రాయేలు ప్రజలు తీసుకుని
వేసుకున్నారు, బయటకు వచ్చేశారు అంతే! ఇక
వారు విగ్రహ సంబంధమైన పూజలకు ప్రతిగా ఉండే ఆ వెండి బంగారు నగలు వేసుకోకూడదు!
ఇలా అడిగి తీసుకుని వేసుకున్న సందర్భమే ఆ ఆభరణముల చేత నీ చెక్కిళ్లు
మరియు నీ కంఠము శోభిల్లుతుంది అన్నారు!
ఇక అలా ఆభరణములు వేసుకున్న ఇశ్రాయేలు స్త్రీలు ఐగుప్తు వదిలి వచ్చాక
ఎర్ర సముద్రము దాటి ఇంకా సీనాయి అరణ్యము వచ్చాక కూడా వాటిని తీసివేయకుండా ఆభరణములు
పెట్టుకుని సింగారించుకుని ఆ ఆభరణములకు సాదృశ్యముగా ఉన్న ఐగుప్తు దేవతలు పూజలను చేస్తూ
దూడను చేసుకుని వ్యభిచరించిన తర్వాత అదే దేవుడు అనగా వారిని దోచుకోడానికి ఆభరణములు
తీసుకుని రమ్మని చెప్పిన దేవుడే ఉగ్రుడై నిర్గమ 33:5—6 వచనాలలో అంటున్నారు:
మీరు లోబడనోళ్లని పిల్లలు నేను మీ మధ్యకు వస్తానా మిమ్మల్ని నాశనం చేసేస్తాను- ఆ నాశనం
నుండి తప్పించుకోవాలి అంటే మీమీద నున్న ఆభరణములు తీసివేయండి అని చెబితే ఆరవ వచనంలో
ఆ నగలు తీసివేశారు!
నిర్గమకాండము 33:5
కాగా యెహోవా మోషేతో ఇట్లనెను నీవు ఇశ్రాయేలీయులతో మీరు లోబడనొల్లని
ప్రజలు; ఒక క్షణమాత్రము నేను మీ నడుమకు వచ్చితినా, మిమ్మును నిర్మూలము చేసెదను గనుక మిమ్మును ఏమి చేయవలెనో అది నాకు తెలియునట్లు
మీ ఆభరణములను మీ మీదనుండి తీసివేయుడి అని చెప్పుమనెను.
నిర్గమకాండము 33:6
కాబట్టి ఇశ్రాయేలీయులు హోరేబు కొండయొద్ద తమ ఆభరణములను తీసివేసిరి.
మరి ఇంతకు ఆ నగలు దేనిని సాదృశ్యంగా చెబుతున్నాయి అంటే కంఠము చుట్టూ
అందమైన నగలు అనగా దేవుణ్ణి దేవుని గుణగణాలు ప్రజలందరికీ చెప్పే మీ కంఠము మరియు మీ సుగుణాలే
ఆ కంఠహారము అని గ్రహించాలి!
నీవు ఎప్పుడైతే ఈ సుగుణాలతో ఉంటావో 11 వ వచనములో
వెండి పువ్వులు ఉండే బంగారు సరములు మేము నీకు చేయిస్తాము అంటే బంగారు సరములు అనగా బంగారు
ఛైను, అనగా బంగారు హారమ్లు వాటిమీద వెండి పువ్వులు వచ్చేవిధంగా
చేసేవారు పూర్వకాలంలో! అనగా ఒకరకమైన బంగారు హారాలు కాసుల పేర్లు
బంగారు పూసల దండలు కావచ్చు! ఇవన్నీ సోలోమోను గారు మరియు అతని
పరివారము ఎప్పుడైతే నీవు ఇలాంటి సుగుణాలతో ఉంటావు అవన్నీ నీకు వేస్తాము అంటున్నారు!
అనగా నీవు ఇలాంటి దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని గుణగణాలు ప్రాచుర్యము చేసే
నీ గుణమునకు మెచ్చి దేవుడు మరిన్ని ఆశీర్వాదాలతో అభిషేకముతో నిన్ను నింపడానికి ఇష్టపడుతున్నారు
అని అర్ధము ప్రియులారా!
మరి
ప్రియ దేవుని బిడ్డా! షూలమ్మితి కి దేవుని గుణగణాలు ప్రకటించే నోరు మరియు సుగుణము ఉందా? మరి నీకు అటువంటి సుగణములు ఉన్నాయా? లేకపోతే నేడే సంపాదించుకో!
దైవాశీస్సులు!!!

కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి